దేశంలోని అనేక ప్రాంతాల్లో బాంబు బెదిరింపులు ఎక్కువైపోయాయి. పాఠశాలలు, షాపింగ్ మాల్స్, ప్రార్థన స్థలాలు, విమానాశ్రయాలు, కార్యాలయాలు, ప్రముఖుల ఇళ్లే టార్గెట్‌గా వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా దక్షిణ ఢిల్లీలోని మూడు మాల్స్‌కు, ఓ ఆసుపత్రికి సోమవారం బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.
చాణక్యపురిలోని చాణక్య మాల్, సాకేత్ ప్రాంతంలోని సెలెక్ట్ సిటీవాక్, వసంత్ కుంజ్‌లోని ఆంబియెన్స్ మాల్ సహా చాణక్యపురిలోని ప్రైమస్ ఆసుపత్రికి ఈ మెయిల్ ద్వారా బాబు బెదిరింపులు వచ్చినట్లు పేర్కొన్నారు. కొన్ని గంటల్లో బాంబు పేలుతుందంటూ దుండగులు మెయిల్‌లో పేర్కొన్నట్లు చెప్పారు.
సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక బృందాలు ఆయా మాల్స్, ఆసుపత్రి వద్దకు చేరుకొని సోదాలు చేపట్టినట్లు వెల్లడించారు. అయితే, ఈ సోదాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ లభించలేదని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. చివరకు ఆ బెదిరింపు బూటకమని తేలింది
కాగా ఈ నెల 17న గురుగ్రామ్‌లోని ఆంబియెన్స్ మాల్‌కు ఇలాంటి బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు మాల్ మేనేజ్‌మెంట్‌కు మెయిల్ ద్వారా బెదిరించారు. ‘ప్రతి ఒక్కరినీ చంపేందుకు మాల్‌లో బాంబులు అమర్చాం. మీలో ఎవ్వరూ తప్పించుకోలేరు, అందరూ చస్తారు’ అంటూ అందులో పేర్కొన్నారు.
దీంతో అప్రమత్తమైన మాల్ అధికారులు వెంటనే పోలీసులు ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి చేరుకొని మాల్‌ను ఖాళీ చేయించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. అప్పుడు కూడా ఎలాంటి బాంబూ దొరకలేదని గురుగ్రామ్ పోలీసులు తెలిపారు. ఇక
Comments
Please login to add a commentAdd a comment