ప్రపంచంలోనే తొలి పోర్టబుల్‌ హాస్పిటల్‌ పారాడ్రాప్‌ | Air Force and Army conducts first ever Arogya Maitri Cube airdrop | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే తొలి పోర్టబుల్‌ హాస్పిటల్‌ పారాడ్రాప్‌

Published Sat, Aug 17 2024 8:42 PM | Last Updated on Sat, Aug 17 2024 8:46 PM

Air Force and Army conducts first ever Arogya Maitri Cube airdrop

ఢిల్లీ: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌, ఆర్మీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన పోర్టబుల్‌ హాస్పిటల్‌ను విజయవంతంగా పారాడ్రాప్‌ చేసినట్లు రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఆరోగ్య మైత్రీ హెల్త్‌ క్యూబ్‌గా పేర్కొనే ఈ ఆస్పత్రిని 15 వేల అడుగుల ఎత్తు నుంచి విజయవంతంగా నేలకు దించినట్లు పేర్కొంది. భీష్మా (భారత హెల్త్‌ ఇనిషియేటివ్‌ ఫర్‌ సహయోగ్‌ హితా అండ్‌ మైత్రి) అనే ప్రాజెక్టులో భాగంగా ఆరోగ్య మైత్రీ హెల్త్‌ క్యూబ్‌ని ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం సంబంధించిన వీడియోను రక్షణ శాఖ విడుదల చేసింది. ఇక.. ఇది ప్రపంచంలోనే తొలి పోర్టబుల్‌ హాస్పిటల్‌ కావటం విశేషం.

విపత్తుల సమయంలో దెబ్బతిన్న ప్రాంతాల్లోని ప్రజలకు అత్యవసర సేవలు అందించాలనే ప్రధాని మోదీ ఆదేశాలతో ఈ ప్రాజెక్టు ప్రారంభించినట్లు తెలిపింది. మారుమూల, పర్వత ప్రాంతాల్లో విపత్తులు సంభవించినప్పుడు తక్షణ సహాయ చర్యలు అందించడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని అన్నారు. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఈ పోర్టబుల్‌ హాస్పిటల్‌ను ఏర్పాటు చేసినట్లు రక్షణ శాఖ పేర్కొంది. ఇక.. పోర్టబుల్ హాస్పిటల్‌లో మొత్తం 72 క్యూబ్స్‌ ఉంటాయి. దీన్ని ఉపయోగించి 200 మందికి ఆరోగ్య సేవలందించవచ్చు. భారత వైమానికి దళానికి సంబంధించిన విమానం సీ-130జీని సాయంతో దీనిని నిర్దేశించిన ప్రాంతానికి చేరవేస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement