సాక్షి, న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ దిగ్గజ నేత ఎల్‌కే అద్వానీకి ఆ పార్టీ టికెట్ నిరాకరించడంపై ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కాషాయ పార్టీ తీరును తప్పుపట్టారు. ‘బీజేపీకి మూలస్తంభం వంటి నేతను ఆ పార్టీ విస్మరించిందని..విలువలు..రాజనీతిజ్ఞ కలిగిన నేతలను గౌరవించాలని, పక్కనపెట్టడం తగ’దని ఫేస్‌బుక్ పోస్ట్‌లో బీజేపీకి వాద్రా హితవు పలికారు.
దిగ్గజ నేతల సీనియారిటీ, సలహాలను విస్మరించడం సరైంది కాదన్నారు. అద్వానీని తానెప్పుడూ మెరుగైన విపక్ష నేతగా తాను గౌరవిస్తానని, సొంత పార్టీనే ఆయనను మరిచిపోవడం బాధాకరమి వాద్రా ఫేస్‌బుక్ పోస్ట్‌లో విచారం వ్యక్తం చేశారు. కాగా తమ పార్టీని వ్యతిరేకించే వారిని బీజేపీ ప్రత్యర్ధులు గానే పరిగణించిది తప్ప వారిని దేశద్రోహులుగా, శత్రువులుగా ఎన్నడూ పరిగణించలేదని ఎల్‌కే అద్వానీ సుదీర్ఘ విరామం అనంతరం తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. ఏప్రిల్ 6న పార్టీ వ్యవస్ధాపక దినం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
చదవండి....(మౌనం వీడిన అడ్వాణీ)
Comments
Please login to add a commentAdd a comment