Robert Wadra
-
Sakshi Cartoon: మిగిలింది మీరొక్కరే కదా! కోరకున్నా వెళ్లిపోండి సార్!
మిగిలింది మీరొక్కరే కదా! కోరకున్నా వెళ్లిపోండి సార్! -
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వెన్నులో వణుకు...
-
దేశంలో కరోనా విలయం, ఒక్కరోజే 81,466 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 81,466 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,23,03,131కి చేరుకున్నట్టు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన వెల్లడించింది. దేశవ్యాప్తంగా 469 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,63,396కి చేరుకుంది. మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటకలలో కరోనా ఉధృతి ఆందోళన పుట్టిస్తోందని కేంద్రం తెలిపింది. మధ్యప్రదేశ్‌లో కరోనా కట్టడికి కొన్ని పట్టణ ప్రాంతాల్లో గురువారం రాత్రి నుంచి లాక్డౌన్ విధించారు. ఏప్రిల్ 5 వరకు ఈ లాక్డౌన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. రెండో డోసు తీసుకున్నా కరోనా పాజిటివ్ ఉత్తర ప్రదేశ్‌కి చెందిన సీనియర్ పోలీసు అధికారికి కోవిడ్–19 రెండు డోసులు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్‌గా తేలింది. తాను రెండు డోసులు తీసుకున్నప్పటికీ కరోనా సోకిందని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (ఐజీ) రాజేశ్ పాండే ఫేస్బుక్ ద్వారా వెల్లడించారు. తన భార్య కరోనా టీకా ఒక డోసు తీసుకున్నారని, ఆమెకి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. మూడు రోజుల క్రితం వాళ్లబ్బాయికి కరోనా సోకింది. రాబర్ట్ వాద్రాకు కరోనా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రాకు కోవిడ్–19 పాజిటివ్‌గా తేలింది. దీంతో ప్రియాంకా శుక్రవారం ఐసోలేషన్లోకి వెళ్లారు. ఈ మేరకు ఆమె ఒక వీడియో విడుదల చేశారు. అస్సాంలో శుక్రవారం, తమిళనాడులో శనివారం, కేరళలో ఆదివారం పాల్గొనాల్సిన ఎన్నికల ప్రచార కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ‘నాకు కోవిడ్–19 నెగెటివ్‌గా నిర్థారణ అయినప్పటికీ వైద్యుల సూచన మేరకు కొన్ని రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంటాను’ అని ఆమె తెలిపారు. రికార్డు స్థాయి వ్యాక్సినేషన్ ఓ వైపు కరోనా కేసులు బెంబేలెత్తిస్తుంటే మరోవైపు జనం కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి బారులు తీరుతున్నారు. 45 ఏళ్ల వయసు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తూ ఉండడంతో 24 గంటల్లో 36.7 లక్షలకుపైగా మంది కోవిడ్–19 టీకాలు తీసుకున్నారు. ఒకే రోజులో ఈ స్థాయిలో వ్యాక్సినేషన్ జరగడం ఇదే మొదటిసారి అని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. యొత్తంగా 36,71,242 వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. 33,65,597 మంది మొదటి డోసు తీసుకుంటే, 3,05,645 మంది రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 6.87 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. పుణెలో రాత్రిపూట కర్ఫ్యూ మహారాష్ట్ర కోవిడ్–19 గుప్పిట్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. రాష్ట్రంలో ఒకే రోజు 43,183 కేసులు నమోదయ్యాయి. పుణేలో గత రెండు రోజులుగా 8 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో శనివారం నుంచి వారం రోజులు రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత కరోనా ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వ ఉన్నతాధికారులు నిర్ణయించారు. మాల్స్, సినిమాహాళ్లు, రెస్టారెంట్లు, బార్లు వారం రోజుల పాటు సాయంత్రం 6 గంటలకే మూసేయాల్సి ఉంటుందని ఆదేశించారు. -
నేడు ఈడీ ముందుకు వాద్రా
సాక్షి, న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్ కేసులో గురువారం ఈడీ అధికారుల ఎదుట హాజరైన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను నేడు మరోసారి ఈడీ ప్రశ్నించనుంది. విదేశాల్లో ఆస్తుల కొనుగోలుకు సంబంధించి మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారనే కేసులో ఆయన పాత్రపై ఈడీ దర్యాప్తు సాగిస్తోంది. శుక్రవారం జరిగే విచారణకూ హాజరు కావాలని వాద్రాను ఈడీ అధికారులు కోరారు. విచారణ అధికారి ఎదుట గురువారం ఉదయం హాజరు కావాలని బుధవారం వాద్రాకు ఈడీ సమన్లు జారీ చేసింది. కాగా తాను దర్యాప్తు సంస్థల ఎదుట హాజరు కావడం ఇది 11వ సారని, దర్యాప్తు సంస్థల విచారణకు తాను సహకరిస్తానని, న్యాయవ్యవస్థ పట్ట తనకు విశ్వాసం ఉందని ఈడీ కార్యాలయానికి చేరుకునే ముందు వాద్రా ట్వీట్ చేశారు. కాగా ఇదే కేసులో ఏప్రిల్ 1న వాద్రాకు ముందస్తు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. -
న్యాయ వ్యవస్థపై విశ్వాసం ఉంది : వాద్రా
సాక్షి, న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్ కేసులో ఈడీ ఎదుట హాజరయ్యేందుకు కొద్దిగంటల ముందు తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని వాణిజ్యవేత్త, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా అన్నారు. భారత న్యాయవ్యవస్థ పట్ల తనకు పూర్తి విశ్వాసం ఉందని, దర్యాప్తు ఏజెన్సీలు, ప్రభుత్వ సంస్థల సమన్లు, నిబంధనలను పూర్తిగా అనుసరిస్తానని స్పష్టం చేశారు. మున్ముందు కూడా తాను ఇదే తీరున సహకరిస్తానని పేర్కొన్నారు. తనపై తప్పుడు అభియోగాలను తొలగించేవరకూ తాను దర్యాప్తు ఏజెన్సీల ఎదుట హాజరవుతానని, వారికి సహకరిస్తానని చెప్పారు. తాను ఇప్పటివరకూ 11 సార్లు దర్యాప్తు సంస్థల ఎదుట హాజరయ్యానని వాద్రా ట్వీట్ చేశారు. లండన్‌లో ఆస్తులు కొనుగోలులో మనీల్యాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న వాద్రాకు ఈ కేసులో ఏప్రిల్ 1న ముందస్తు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. -
రాబర్ట్ వాద్రాకు ఈడీ సమన్లు
సాక్షి, న్యూఢిల్లీ : విదేశాల్లో అక్రమాస్తులకు సంబంధించి మనీల్యాండరింగ్ కేసులో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఈడీ బుధవారం సమన్లు జారీ చేసింది. దర్యాప్తు ఏజెన్సీ అధికారుల ఎదుట గురువారం ఉదయం హాజరు కావాలని కోరింది. లండన్‌లో 2 కోట్ల పౌండ్ల ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేసిన క్రమంలో వాద్రాపై మనీల్యాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే కేసులో ఈ ఏడాది ఏప్రిల్ 1న వాద్రాకు ముందస్తు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. కేసులో సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించరాదని కూడా వాద్రాను కోర్టు కోరింది. ఇదే కేసులో వాద్రా సన్నిహితుడు మనోజ్ అరోరాకు కూడా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. -
దిగ్గజ నేతను పక్కన పెడతారా..?
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ దిగ్గజ నేత ఎల్కే అద్వానీకి ఆ పార్టీ టికెట్ నిరాకరించడంపై ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కాషాయ పార్టీ తీరును తప్పుపట్టారు. ‘బీజేపీకి మూలస్తంభం వంటి నేతను ఆ పార్టీ విస్మరించిందని..విలువలు..రాజనీతిజ్ఞ కలిగిన నేతలను గౌరవించాలని, పక్కనపెట్టడం తగ’దని ఫేస్బుక్ పోస్ట్‌లో బీజేపీకి వాద్రా హితవు పలికారు. దిగ్గజ నేతల సీనియారిటీ, సలహాలను విస్మరించడం సరైంది కాదన్నారు. అద్వానీని తానెప్పుడూ మెరుగైన విపక్ష నేతగా తాను గౌరవిస్తానని, సొంత పార్టీనే ఆయనను మరిచిపోవడం బాధాకరమి వాద్రా ఫేస్బుక్ పోస్ట్‌లో విచారం వ్యక్తం చేశారు. కాగా తమ పార్టీని వ్యతిరేకించే వారిని బీజేపీ ప్రత్యర్ధులు గానే పరిగణించిది తప్ప వారిని దేశద్రోహులుగా, శత్రువులుగా ఎన్నడూ పరిగణించలేదని ఎల్కే అద్వానీ సుదీర్ఘ విరామం అనంతరం తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. ఏప్రిల్ 6న పార్టీ వ్యవస్ధాపక దినం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చదవండి....(మౌనం వీడిన అడ్వాణీ) -
లండన్ ఆస్తులు..బికనీర్ భూములు
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ సోదరి ప్రియాంకగాంధీ రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన తర్వాతే ఆమె భర్త రాబర్ట్ వాద్రాను ఈడీ విచారణకు పిలవడం రాజకీయ చర్చకు దారితీసింది. దీని వెనక కక్షసాధింపు ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా, యూపీయే అధికారంలో ఉన్న సమయంలో ఆయనకు అనుచిత లబ్ధి చేకూరిందని బీజేపీ వాదిస్తోంది. వాద్రా మనీలాండరింగ్ కేసులో పెద్ద కథే ఉందని, ఈ వ్యవహారంలో ఆయనకు చాలా మంది సహకరించారని దర్యాప్తు సంస్థ ఈడీ అంటోంది. వాద్రాపై వచ్చిన ఆరోపణలు, కేసుల నేపథ్యమేంటో ఓసారి పరిశీలిస్తే.. అటుతిరిగి ఇటుతిరిగి వాద్రా చెంతకే.. బ్రిటన్‌లో ఆస్తుల కొనేందుకు వాద్రా మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రస్తుతం ఈడీ విచారిస్తోంది. అందులో భాగంగానే ఆయన మూడుసార్లు ఈడీ ఆఫీసుకొచ్చారు. 2009లో లండన్‌లో 12 బ్రాన్స్టన్ స్క్వేర్‌లోని ఓ భవంతిని వాద్రా తరఫున ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీకి చెందిన వోర్టెక్స్ సంస్థ 1.9 మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేసింది. ఏడాది గడిచాక దుబాయ్‌కి చెందిన సీసీ తంపీకి అమ్మేసింది. భవన ఆధునీకరణకు రూ.65 వేల పౌండ్లు ఖర్చుచేసిన తంపీ..తాను కొనుగోలు చేసిన ధరకే బ్రిటన్‌లోని సింటక్ కంపెనీకి అమ్మారు. సింటక్కు భండారీకి సంబంధాలున్నాయని భావిస్తున్నారు. ఇలా ఒక వ్యూహం ప్రకారం చేతులు మారిన నగదు మళ్లీ వాద్రా వద్దకే చేరిందనేది ఈడీ వాదన. భండారీ, వాద్రా మధ్య ఈ–మెయిళ్ల రాయబారం నడిచినట్లు తేలింది. వాద్రాకు బ్రిటన్‌లో బ్రాన్స్టన్ స్క్వేర్తో పాటు రూ.110 కోట్లకు పైబడిన 8 ఆస్తులున్నాయని ఈడీ వాదన. 2009లో యూపీఏ హయాంలో పెట్రోలియం సరఫరాకు విదేశాలతో ఒప్పందం కుదిరినప్పుడు వాద్రాకు, ఆయన అనుయాయులకు ముడుపులు ముట్టాయని, ఆ సొమ్ముతోనే వాద్రా లండన్‌లో ఆస్తులుకొన్నట్లు పేర్కొంది. ‘స్కైలైట్’తో భారీ లాభాలు.. వాద్రా కంపెనీ స్కైలైట్ హాస్పిటాలిటీకి రాజస్తాన్‌లోని బికనీర్‌లో 275 బిగాల భూమి ఉంది. ఈ భూమి కొనుగోలు వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఈడీ 2015లోనే కేసువేసింది. స్కైలైట్ నుంచి ఓ ఉక్కు సంస్థ మార్కెట్ ధర కన్నా అధిక మొత్తానికి భూమిని కొన్న దానిపైనా దర్యాప్తు జరుపుతోంది. ఈ కేసులో వాద్రా ఈ నెల 12న బికనీర్‌లో ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. స్కైలైట్ హాస్పిటాలిటీ హరియాణాలోని గురుగ్రామ్ సెక్టార్ 83లో 3.5 ఎకరాల భూమి కొనుగోలు చేసి దాన్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి బీఎస్ హుడా సాయం తీసుకున్నట్లు ఈడీ ఆరోపించింది. తరువాత ఆ భూమిని వాణిజ్యపరంగా విక్రయించి భారీగా లాభాలు దండుకోవడంపై విచారణ జరుగుతోంది. ఈ వ్యవహారంలో వాద్రా, హుడాపై కేసులు నమోదయ్యాయి. మూడోసారి ఈడీ ముందుకు న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో రాబర్డ్ వాద్రా శనివారం మూడోసారి ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కార్యాల యానికి వచ్చారు. ఇదేకేసులో వాద్రాను నెల 6, 7 తేదీల్లోనూ ప్రశ్నించారు. శనివారం వాద్రాను ఏకంగా ఎనిమిది గంటలు విచారించిన అధికారులు ఆయన వ్యక్తిగత, వ్యాపార ఆర్థిక లావాదేవీలపై పలు ప్రశ్నలు వేశారు. తమ దర్యాప్తులో సేకరించిన కీలక పత్రాలను ఈ సందర్భంగా వారు వాద్రా ముందుంచినట్లు సమాచారం. పరారీలో ఉన్న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీతో వాద్రాకున్న సంబంధాల వివరాలు సైతం కీలక పత్రాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, సోమవారం సైతం విచారణ కోసం ఈడీ కార్యాలయానికి రావాల్సిందిగా అధికారులు వాద్రాను ఆదేశించారు. -
రాబర్ట్ వాద్రాకు మధ్యంతర బెయిల్
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ బావ రాబర్ట్ వాద్రాకు ఢిల్లీలోని ఓ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఈ నెల 6వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరై విచారణకు సహకరించాలని సూచించింది. లండన్‌లోని రూ.17.77 కోట్ల విలువ చేసే ఆస్తులను మనీలాండరింగ్ ద్వారానే వాద్రా సమకూర్చున్నారంటూ ఈడీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న వాద్రా తన న్యాయవాది ద్వారా మధ్యంతర బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ‘వాద్రా తన తల్లికి చికిత్స చేయించేందుకు లండన్ వెళ్లారు. 6న ఇక్కడికి వచ్చిన తర్వాత ఈడీ ఎదుట హాజరవుతారు’ అని వాద్రా తరఫు లాయర్ చెప్పారు. దీంతో కోర్టు వాద్రాకు బెయిలు మంజూరు చేసింది. ఇందుకోసం, రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తుతోపాటు అంతే సమానమైన జామీను సమర్పించాలని ఆదేశించింది. -
వాద్రా పన్ను ఎగవేతలపై బీజేపీ ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ బీజేపీ విమర్శల దాడికి పదునుపెట్టింది. రాహుల్ బావ, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పన్ను ఎగవేతపై వివరణ ఇవ్వాలని రాహుల్‌ను డిమాండ్ చేసింది. 2010-11 ఆర్థిక సంవత్సరంలో పన్ను బకాయిలను చెల్లించాలని ఆదాయ పన్ను శాఖ రాబర్ట్ వాద్రాను ఆదేశించిందని బీజేపీ ప్రతినిధి సంబిట్ పాత్ర పేర్కొన్నారు. వాద్రా పన్ను ఎగవేతలపై రాహుల్ ఏం సమాధానం చెబుతారని ఆయన నిలదీశారు. 2010-11 సంవత్సరానికి రాబర్ట్ వాద్రాకు చెందిన స్కై లైట్ హాస్పిటాలిటీనీ రూ 25.8 కోట్ల పన్ను బకాయిలను చెల్లించాలని ఐటీ శాఖ కోరినట్టు వార్తలు వచ్చిన క్రమంలో బీజేపీ రాహుల్ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. సంబంధిత సంవత్సరానికి కంపెనీ ఆదాయం రూ 42.98 కోట్లు కాగా, కంపెనీ కేవలం రూ 36.9 లక్షలనే ఆదాయంగా చూపిందని ఐటీ వర్గాలు స్పష్టం చేశాయి. వాస్తవ ఆదాయంలో కేవలం 0.86 శాతాన్నేరాబడిగా చూపి కంపెనీ భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్టు ఐటీ శాఖ విచారణలో నిగ్గు తేలింది. కాగా గతంలోనూ వాద్రా హర్యానా భూముల విషయంలో, పన్ను ఎగవేతలపై బీజేపీ గాంధీ కుటుంబం లక్ష్యంగా విమర్శలతో విరుచుకుపడింది. -
నివేదిక ప్రకారమే ‘వాద్రా’పై చర్య
చండీగఢ్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కంపెనీలకు భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ధింగ్రా కమిటీ నివేదిక ప్రకారమే చర్యలు తీసుకుంటామని హరియాణా సీంఎ మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. నివేదికలోని అంశాలు బహిర్గతమయ్యాయన్న కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చారు. 2008లో జరిగిన భూ కేటాయింపుల వ్యవహారంలో వాద్రాపై కమిటీ నేరాభియోగాలు మోపిందని మీడియాలో వార్తలు రావడంతో ఆయనస్పందించారు. వాద్రా కంపెనీలకు లబ్ధిచేకూర్చడానికి కుట్ర జరిగిందని కమిటీ నిర్ధారించినట్లు ఓ దిన పత్రికలో కథనం ప్రచురితమైంది. వాద్రా కొన్న ఆస్తులపైనా విచారణ జరపాలని కమిటీ నిర్ణయించినట్లు వెల్లడించింది. మరోవైపు, తన భర్త వ్యాపార లావాదేవీలతో తనకేం సంబంధంలేదని వాద్రా భార్య ప్రియాంక గాంధీ ప్రకటించారు. డీఎల్ఎఫ్ నుంచి స్వీకరించిన సొమ్ము నుంచి తన భార్య ఫరీదాబాద్‌లో ఆస్తులు కొన్నారా అని వాద్రాను విలేకర్లు ప్రశ్నించడంపై ప్రియాంక కార్యాలయం స్పందించింది. వాద్రా కంపెనీ స్కైలైట్ హాస్పిటాలిటీకి భూ కేటాయించడానికి ఆరేళ్ల క్రితమే ప్రియాంక ఫరీదాబాద్‌లోని అమీపూర్ గ్రామంలో రూ.15 లక్షలకు 5 ఎకరాలు కొన్నారంది. నివేదిక ‘లీక్’పై కాంగ్రెస్, బీజేపీ విమర్శలు గుప్పించుకున్నాయి. వాద్రాపై రాజకీయ కక్షతోనే కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉద్దేశపూర్వకంగానే నివేదికలోని కొన్ని విషయాలని లీక్ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఆరోపణలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఖట్టర్ తోసిపుచ్చారు.