సాక్షి, న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్ కేసులో గురువారం ఈడీ అధికారుల ఎదుట హాజరైన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను నేడు మరోసారి ఈడీ ప్రశ్నించనుంది. విదేశాల్లో ఆస్తుల కొనుగోలుకు సంబంధించి మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారనే కేసులో ఆయన పాత్రపై ఈడీ దర్యాప్తు సాగిస్తోంది. శుక్రవారం జరిగే విచారణకూ హాజరు కావాలని వాద్రాను ఈడీ అధికారులు కోరారు.
విచారణ అధికారి ఎదుట గురువారం ఉదయం హాజరు కావాలని బుధవారం వాద్రాకు ఈడీ సమన్లు జారీ చేసింది. కాగా తాను దర్యాప్తు సంస్థల ఎదుట హాజరు కావడం ఇది 11వ సారని, దర్యాప్తు సంస్థల విచారణకు తాను సహకరిస్తానని, న్యాయవ్యవస్థ పట్ట తనకు విశ్వాసం ఉందని ఈడీ కార్యాలయానికి చేరుకునే ముందు వాద్రా ట్వీట్ చేశారు. కాగా ఇదే కేసులో ఏప్రిల్ 1న వాద్రాకు ముందస్తు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment