ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా విమర్శనస్త్రాలను సంధించారు. ఏకలవ్యుడు తన గురువు ( ద్రోణాచార్యుడు ) కోరిక మేరకు తన వేలిని త్యాగం చేశాడని, కానీ ప్రధాని మోదీ మాత్రం అతని గురువులను దూరం పెట్టాడని విమర్శించారు. రాహుల్ చేసిన ఈ వీడియో ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ ట్వీట్‌కు క్యాప్షన్‌గా..‘ ఏకలవ్యుడు తన గురువు కోరిక మేరకు కుడి బొటన వేలిని త్యాగం చేశాడు. కానీ బీజేపీ మాత్రం తమ గురువులను దూరం పెట్టింది. అటల్ బిహారీ వాజ్‌పెయ్, ఎల్‌కే అడ్వాణీ, జస్వంత్ సింగ్ వంటి అగ్రనేతలను వారి కుటుంబాలను అవమాన పరచడమే భారతీయ సంస్కృతి రక్షించడమని మోదీ భావిస్తున్నారు.’ అని రాహుల్ పేర్కొన్నాడు