ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తున్న పేరు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(AI). ఈ టెక్నాలజీ చేస్తున్న పనులకు ఇది ఎంతగానో పాపులర్ అయ్యింది. ఇదిలా ఉండగా కొందరు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సెలబ్రిటీల ఫోటోలను మారుస్తూ నెట్టింట షేర్ చేయడం ట్రెండ్‌గా మారింది. ఈ క్రమంలో ఇప్పటికే తమ అభిమాన స్టార్ హీరోల ఫోటోలను ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించి మార్చగా.. తాజాగా ఆ వరుసలో రాజకీయ నేతలు కూడా చేరారు.
అంతా బార్బీ ఫీవర్..
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ట్రెండింగ్‌లో ఏది నడుస్తుంటే వాటిని ఫాలో అవుతుంటారు సహజమే. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలైన చిత్రం బార్బీ రికార్డ్ కలెక్షన్లను కొల్లగొడుతోంది. దీంతో అంతటా బార్బీ ఫీవర్ నడుస్తోంది. ప్రజలు, వ్యాపారాలు, బ్రాండ్‌లు ఇలా ప్రతి ఒక్కటీ గులాబీ రంగులో దూసుకుపోతోంది. తాజాగా ఓ ఏఐ ఆర్టిస్ట్ భారత్‌లోని ప్రముఖ రాజకీయ నేతలను ఏఐ సాయంతో వారందరిని పింక్ డ్రెస్‌లోకి మార్చాడు. హూ వోర్ వాట్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. "వీరిలో మీకు ఎవరు ఇష్టం? ఇక్కడ బార్బీ, అక్కడ బార్బీ! ప్రతిచోటా బార్బీ" అని ఆ ఫోటోల కింద ఈ క్యాప్షన్‌ను జోడించారు.
ఏఐ ఉపయోగించి భారత్‌లోని 10 మంది రాజకీయ నాయకులు వీళ్లే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, భారత హోం వ్యవహారాల మంత్రి అమిత్ షా, లోక్‌సభ మాజీ ప్రతిపక్ష నేత సోనియా గాంధీ, ఆర్‌జేడీ లాలూ ప్రసాద్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ నేత నితిన్ గడ్కరీ. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు వావ్, సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment