భోపాల్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయాల వల్ల చిరువ్యాపారులు కుదేలయ్యారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో భాగంగా రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్‌లోని ఓ సభలో మాట్లాడారు. ‘ఈ రోజులో గత 40 ఏళ్లలో లేని అత్యంత భారీ నిరుద్యోగం దేశంలో ఉంది. పాకిస్తాన్‌లో ఉన్న నిరుద్యోగం కంటే రెండింతలు అధికంగా ఉంది. బంగ్లాదేశ్, భూటాన్ దేశాలో కంటే ఎక్కువ నిరుద్యోగం భారత్‌లో ఉంది. దానికి గల కారణం ప్రధాని మోదీ అమలు చేసిన విధానాలు. ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాల వల్ల చిరు వ్యాపారులు కుదేలయ్యారు’ అని రాహుల్‌గాంధీ మడిపడ్డారు.
అంతకు ముందు మరో సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. గతంలో చేపట్టిన యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగింది. అయితే మిగతా రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, చత్తీస్‌ఘడ్, గుజరాత్ ఎందుకు వెళ్లలేదని ప్రజలు తనను ప్రశ్నించారని తెలిపారు. అందుకే మరో యాత్ర చేపట్టానని.. ఇది న్యాయ కోసం చేసే యాత్ర అని రాహుల్ పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ యాత్ర మధ్యప్రదేశ్‌లో ప్రవేసించిన ఇవాళ ఉదయం ఆయన ఎక్స్ సర్వీస్‌మెన్, అగ్నీవీర్లతో మాట్లాడారు. ఈ రోజు రాహుల్ గాంధీ బిహార్‌లో జరిగే ‘ఇండియా కూటమి’ ర్యాలీ సందర్భంగా తన యాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు. తిరిగి సోమవారం ప్రారంభమై మధ్యప్రదేశ్‌లో పలు జిల్లాకుండా కొనసాగనుంది.
రైల్వే పాలసీలు ధనికుల కోసమే..
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైల్వే పాలసీలపై రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. రైల్వే పాలసీలన్నీ కేవలం ధనికుల కోసమే తీసుకువచ్చారని మండిపడ్డారు. ‘ప్రతి ఏడాది 10 శాతం రైల్వే చార్జీలు పెంచుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజలను దోపిడి చేస్తోంది. క్యాన్సలేషన్ చార్జీలు పెంచుతోంది. ప్లాట్‌ఫామ్ టికెట్ చార్జీలు పెంచింది. ఉన్నత వర్గానికి చెందిన రైలు పేరుతో ప్రజలను దోపిడి చేస్తోంది. పేదలు కనీసం ఆ రైలులో కాలుపెట్టలేని పరిస్థితి ఉంది.
... రైళ్లలో ఏసీ కోచ్‌లు సంఖ్య పెంచి.. జనరల్ కోచ్‌లు సంఖ్య తగ్గించారు. జనరల్ కోచ్‌ల తగ్గింపుతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ కోచ్‌ల తయారీ కంటే మూడు రెట్లు ఎక్కవ ఏసీ కోచ్‌లు తయారు చేస్తున్నారు. రైల్వే బడ్జెట్ విడిగా ప్రవేశపెట్టడం ఆపేయటం మూలంగా రైల్వేలో జరిగే కుట్రలు తెలియటం లేదు’ అని రాహుల్ గాంధీ ‘ఎక్స్’ ట్విటర్‌లో మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment