
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఖేల్‌రత్న, అర్జున అవార్డులను వెనక్కి ఇవ్వడానికి శనివారం ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసానికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమెను కర్తవ్వపథ్‌లో పోలీసులు అడ్డుకున్నారు. తాజాగా దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. దేశంలోని ప్రతి ఆడబిడ్డకు ఆత్మగౌరవం ముందు వస్తుంది. మరేదైనా పతకం లేదా గౌరవం ఆ తర్వాత వస్తుందని అన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం తనను తాను బాహుబలిగా ప్రకటించుకునే వ్యక్తి విలువ.. వీరత్వంతో ఈ ఆడబిడ్డల కన్నీళ్లను మించిందా? అని సూటిగా ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోదీ తాను భారతజాతికి కాపలాదారని అంటారని మండిపడ్డారు. మరీ మోదీ పాలనలో ఇలాంటి క్రూరత్వం కనిపించడం చాలా బాధాకరమని అన్నారు. అయితే నిన్న వినేష్ ఫోగాట్‌ను పోలీసులు అడ్డుకున్న వీడియోను ఆయన ‘ఎక్స్’ ట్విటర్ పోస్ట్ చేశారు.
देश की हर बेटी के लिये आत्मसम्मान पहले है, अन्य कोई भी पदक या सम्मान उसके बाद।
— Rahul Gandhi (@RahulGandhi) December 31, 2023
आज क्या एक ‘घोषित बाहुबली’ से मिलने वाले ‘राजनीतिक फायदे’ की कीमत इन बहादुर बेटियों के आंसुओं से अधिक हो गई?
प्रधानमंत्री राष्ट्र का अभिभावक होता है, उसकी ऐसी निष्ठुरता देख पीड़ा होती है। pic.twitter.com/XpoU6mY1w9