ఢిల్లీ: జాతుల మధ్య అల్లర్లతో హింస చెలరేగిన మణిపూర్ రాష్ట్రాన్ని ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించాలని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ కోరారు. ఈ మేరకు ఆయన ఇటీవల మూడోసారి మణిపూర్ సందర్శించిన వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
‘‘ మణిపూర్ ఇంకా ఆందోళనలోనే ఉంది. జాతుల మధ్య చెలరేగిన హింసలో ఇళ్లు కాలిపోయాయి. అమాయక ప్రజలు ప్రమాదంలో పడ్డారు. వేల కుటుంబాలు నిరాశ్రయులై సహాయక శిబిరాల్లో ఉన్నారు. నేను 2023 మే నుంచి ఇప్పటివరకు మూడుసార్లు మణిపూర్‌కు వెళ్లాను. ఇప్పటికే కూడా మణిపూర్ రెండు ప్రాంతాలుగా విడిపోయి ఉంది. ఇప్పటికైనా ప్రధాని మోదీ మణిపూర్ సందర్శించాలి. అక్కడి ప్రజలు సమస్యలు విని, శాంతిని నెలకొల్పాలి’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
मणिपुर में हिंसा शुरू होने के बाद, मैं तीसरी बार यहां आ चुका हूं, मगर अफसोस स्थिति में कोई सुधार नहीं है - आज भी प्रदेश दो टुकड़ों में बंटा हुआ है।
घर जल रहे हैं, मासूम ज़िंदगियां खतरे में हैं और हज़ारों परिवार relief camp में जीवन काटने पर मजबूर हैं।
प्रधानमंत्री को मणिपुर खुद… pic.twitter.com/8EaJ2Tn6v8— Rahul Gandhi (@RahulGandhi) July 11, 2024
ఇటీవల మణిపూర్‌లో పర్యటించిన రాహుల్ గాంధీ చురచంద్‌పూర్ సహాయక శిబిరంలో బాధితులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ ప్రభుత్వం ఇక్కడ ఘర్షణలకు ముగింపు పలకాలని భావిస్తేనే తొందరగా సమస్య పరిష్కారం అవుతుంది. మణిపూర్ ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తా.కానీ, దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి’’ అని అన్నారు.
గతేడాది మణిపూర్‌లోని కుకీ, మైతేయి జాతుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ కాస్త.. సింసకు దారితీసిన విషయం తెలిసింది. ఈ హింసాత్మక ఘటనల్ల 224 మంది మృతి చెందగా.. సుమారు 60 వేల మంది ప్రజలు వలస వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment