
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు బిలియనీర్ గౌతమ్ అదానీ కౌంటర్ ఇచ్చారు. తమ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులు అంతా పారదర్శకమేనని, ఆ పెట్టుబడులు ఎలా వచ్చాయో తెలుపుతూ అదానీ గ్రూప్ నివేదికను విడుదల చేసింది.
అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్, అదానీ గ్రూప్ వివాదంపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నానంటూ..అదానీకి చెందిన షెల్ కంపెనీలలో 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎవరు పెట్టారు? అని ప్రశ్నించారు. ఆ నిధులు ఎవరిదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలో రాహుల్ వ్యాఖ్యలపై అదానీ గ్రూప్ కౌంటర్‌గా పెట్టుబడులు ఎలా వచ్చాయో తెలిపింది.
బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ 2019 నుండి గ్రూప్ సంస్థలలో 2.87 బిలియన్ డాలర్ల వాటా విక్రయాల వివరాలు, అలాగే 2.55 బిలియన్ డాలర్లు గ్రూప్ కంపెనీల వ్యాపారాల్లోకి ఎలా వచ్చాయన్న విషయాలనూ వివరించింది. కాగా, అదానీ గ్రూప్‌లో విదేశీ పెట్టుబుడులపై ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించిన నివేదికను అదానీ గ్రూప్ ఖండించింది. ఇది గ్రూప్ ప్రతిష్టను దెబ్బతీసేలా ‘ఉద్దేశపూర్వక’ ప్రయత్నమని పేర్కొంది