తిరువనంతపురం: వయనాడ్ విషాదం మా మనసుల్ని కలచివేసింది అని కేరళ వయనాడు విషాదంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ విచారం వ్యక్తం చేశారు. గురువారం కేరళలో కొండచరియలు విరిగిపడిన వయనాడ్‌లోని చూరల్‌మల ప్రాంతాన్ని సందర్శించారు. ప్రజల క్షేమ సమాచారాన్ని, భద్రతా బలగాల సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. మానాన్న రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో.. ఇప్పుడు అంతే బాధపడుతున్నా.. యావత్ దేశం వయనాడ్ బాధను చూస్తోంది. నేనొక్కడినే కాదు అనేకమంది ఈ బాధను అనుభవిస్తున్నారు. వయనాడ్ విషాదం మా మనసుల్ని కలచివేసింది. రాజకీయాలు మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదన్న ఆయన.. బాధితులకు అన్నీ రకాలుగా సహాయం అందించడమే మా ప్రాధాన్యమని వ్యాఖ్యానించారు.
వయనాడ్ ప్రజల బాధను చూడలేకపోతున్నాం. బాధితులకు అండగా నిలిచేందుకు ఇక్కడికి వచ్చాం. హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఇలాంటి విషాదాలే చోటు చేసుకున్నాయి. ఈ విషాదం చూస్తే నాకు మాటలు రావడం లేదు అని ప్రియాంక గాంధీ విచారం వ్యక్తం చేశారు.
#WATCH | On deaths due to Wayanad landslides, Congress MP & LoP Lok Sabha, Rahul Gandhi says, "Today, I feel how I felt when my father died. Here people have not just lost a father but an entire family. We all owe these people respect and affection. The whole nation's attention… pic.twitter.com/9dSPI6kQdx
— ANI (@ANI) August 1, 2024
Comments
Please login to add a commentAdd a comment