లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలోని యువత, నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీ 10 ఎన్నికల వాగ్ధానాలను ప్రకటించే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్‌లోని బద్నావర్ జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి జరిగే ర్యాలీలో రాహుల్ గాంధీ ఈ ప్రకటన చేస్తారని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్ఐ తెలిపింది.
గతవారం భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఆదివారం మధ్యప్రదేశ్ గ్వాలియర్ జిల్లాలోని మోహనాలో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని అన్నారు. పాకిస్తాన్ లాంటి దేశాల కంటే మన దేశంలోనే ఎక్కువ నిరుద్యోగం ఉన్నది అని చెప్పారు.
ఈ తరుణంలో ఉజ్జయినిలో భారత్ న్యాయ్ యాత్రలో నిరుద్యోగుల కోసం ఎన్నికల హామీలను ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ వాగ్ధానాలు ఏంటనేది తెలియాల్సి ఉంది.
కాగా, రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్రను 15 రాష్ట్రాల్లో 100 లోక్‌సభ నియోజవర్గాలను మీదిగా దాదాపు 67 రోజులపాటు 6, 713 కిలోమీటర్లు రాహుల్ పర్యటించనున్నారు. మొత్తం 110 జిల్లాల మీదుగా సాగే యాత్ర ..మార్చి 20 లేదా 21న ముంబైలో ముగియనుంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ ర్యాలీ మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment