‘కుస్తీ’ పట్టిన రాహుల్‌ గాంధీ | WFI Crisis Continues: Rahul Gandhi Meets Bajrang Punia Other Wrestlers | Sakshi
Sakshi News home page

రెజ్లింగ్‌ క్రీడాకారులకు రాహుల్‌ గాంధీ మద్దతు

Published Wed, Dec 27 2023 10:49 AM | Last Updated on Wed, Dec 27 2023 11:16 AM

WFI crisis continues: Rahul Gandhi Meets Bajrang Punia Other Wrestlers  - Sakshi

హర్యానా:  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రముఖ రెజ్లింగ్‌ క్రీడాకారుడు బజరంగ్‌ పూనియా, ఇతర రెజ్లింగ్‌ క్రీడాకారులను హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో ఛారా గ్రామంలొ కలుసుకున్నారు. ఆయన బుధవారం ఉదయమే.. రెజ్లింగ్‌ క్రీడాకారులు నిరసన వ్యక్తం చేస్తున్న ప్రదేశానికి వెళ్లారు. భారత  రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్ష ఎన్నికకు సంబంధించి.. రెజ్లింగ్‌ క్రీడాకారులు నిరసన తెపుతున్న విషయం తెలిసిందే.

భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్‌ సింగ్‌ ఎంపికను నిరసిస్తూ... బజరంగ్‌ పూనియా తనకు వచ్చిన పద్మశ్రీ అవార్డును ఎనక్కి ఇస్తున్నట్లు  ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమయాలో బుధవారం ఎంపీ రాహుల్‌ గాంధీ క్రీడాకారులతో భేటీ అయి వారికి మద్దతుగా నిలిచారు. దీంతో ఎంపీ రాహుల్‌ గాంధీ సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది. 

‘ఎంపీ రాహుల్‌ గాంధీ రెజ్లర్ల రోజువారి సాధన, కార్యకలాపాలను తెలుసుకోవడానికి మా వద్దకు వచ్చారు. కాసేపు మాతో పాటు రెజ్లింగ్‌ కూడా చేశారు’ అని క్రీడాకారుడు బజరంగ్‌ పూనియా తెలిపారు. ‘రాహుల్‌ గాంధీ ఇక్కడ వస్తున్నట్లు మాకు ఎవరూ సమాచారం అందించలేదు. మేము రెజ్లింగ్‌ ప్రాక్టిస్‌ చేస్తున్న క్రమంలో అకస్మత్తుగా మా వద్దకు ఆయన చేరుకున్నారు. ఆయన ఉదయమే 6.15 గంటలకు ఇక్కడికి  వచ్చారు. మాతో పాటు కాసేపు వ్యాయామం​ చేశారు. ఆయనకు క్రీడల పట్ల ఉన్న అనుభవాలను మాతో పంచుకున్నారు. రాహుల్‌ గాంధీకి క్రీడాల పట్ల చాలా పరిజ్ఞానం  ఉంది’ అని రెజ్లింగ్‌ కోచ్‌ వీరేంద్ర ఆర్య  పేర్కొన్నారు.

బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషన్‌ శరణ్‌ సింగ్‌కు నమ్మినబంటుగా పేరున్న సంజయ్‌ కుమార్‌ను.. భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికపై నిరసన తెలుపుతూ..  తాజాగా రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ కూడా అర్జున, మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న అవార్డులు వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించారు. రెజ్లర్లు రోడ్డెక్కి పోరాడుతున్న క్రీడాశాఖ నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడం గమనార్హం.

చదవండి:  వినేశ్‌ ఫొగాట్‌ సంచలన నిర్ణయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement