
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతునే ఉన్నాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కొంత మంది తెలుగు దేశం పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ నేత ప్రతాప్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు అల్లుడు మదన మోహన్, ఉస్మానియా విశ్వ విద్యాలయం విద్యార్థి నాయకుడు పృథ్వీ రాజ్ యాదవ, తెలంగాణ ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్న హర్షవర్ధన్ రెడ్డిలు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కుంతియా, సునితా లక్ష్మారెడ్డి హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment