
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఓ వృద్ధ మహిళ మనసు పారేసుకుంది. ఇటీవల 107వ పుట్టినరోజు వేడుకలు చేసుకున్న ఓ వృద్ధ మహిళ కోరిక సంచలంగా మారింది. పుట్టినరోజు కానుకగా ఏమివ్వాలని అడిగిన తన మనవరాలు దీపాలీ సికండ్‌కి ఆ బామ్మ ‘రాహుల్ గాంధీ చాలా అందంగాడు.. ఆయనని కలుస్తా’, అని చెప్పింది. ఆ బామ్మ కోరికను దీపాలీ సికండ్ రాహుల్ గాంధీకి ట్వీట్ చేసింది. దీనికి రాహుల్ స్పందించి ‘మీ అందమైన బామ్మకి నా తరుపున పుట్టినరోజు, క్రిస్మస్ శుభాకాంక్షలు’ అని తెలిపాడు. అంతేకాదు నా తరుపున బామ్మని గట్టిగా కౌగిలించుకోండి అని అందులో పేర్కొన్నారు.
Today my grandmother turned 107. Her one wish. To meet @OfficeOfRG Rahul Gandhi ! I asked her why? She whispers ... He's handsome ! pic.twitter.com/k3wUaSMKfE
— Dipali Sikand (@SikandDipali) 25 December 2017