Wayanad Landslides: బెయిలీ వంతెన నిర్మాణం పూర్తి: సీఎం పినరయి | Kerala Wayanad Landslides August 01 Live Updates | Sakshi
Sakshi News home page

వయనాడ్‌ విషాదం: కొనసాగుతున్న సహాయక చర్యలు.. అప్‌డేట్స్‌

Published Thu, Aug 1 2024 8:41 AM | Last Updated on Thu, Aug 1 2024 4:19 PM

Kerala Wayanad Landslides August 01 Live Updates

Updates

వయనాడ్‌ కొండచరియలు విరిగిపడిన విపత్తులో మృతుల సంఖ్య 288కి చేరింది. మరో 200 మంది జాడ తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు 219 మంది గాయాలతో చికిత్స పొందుతున్నట్లు కేరళ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

వ‌య‌నాడ్‌లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి.. తీవ్ర ప్రాణ న‌ష్టాన్ని మిగిల్చిన ప్రాంతాన్ని ఇవాళ రాహుల్ గాంధీ పర్యటించారు. చూర్‌మ‌లాలో ఆయ‌న త‌న సోద‌రి ప్రియాంకా గాంధీతో క‌లిసి ప‌ర్య‌టించారు. బాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు. 288 మంది మృతిచెంద‌గా, వెయ్యి మందిని కాపాడారు. 
 

  • వయనాడ్‌ విపత్తుపై అఖిలపక్ష సమావేశం జరిగింది: సీఎం పినరయి విజయన్‌
  • ఈ ఘటనపై  ప్రతిపక్ష పార్టీలతో కలిసి చర్చించాం.
  • శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించడంమైనే మేము దృష్టి పెట్టాం. ఆర్మీ సిబ్బంది కృషిని అభినందిస్తున్నాను. చాలా మందిని రక్షించినట్లు వారు  తెలిపారు. 
  • మట్టి, బురద  కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు యంత్రాలను కిందకు దింపడం కష్టతరంగా ఉండడంతో వంతెన నిర్మాణం చేస్తున్నారు. బెయిలీ వంతెన నిర్మాణం చాలా వరకు పూర్తయింది.
  • గల్లంతైన వారి కోసం నదిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 
    రక్షించిన వారిని తాత్కాలికంగా శిబిరాలకు తరలిస్తున్నారు. పునరావాస పనులు త్వరగా జరుగుతున్నాయి.

     

  • సీఎం పినరయి విజయన్‌ వయనాడ్‌లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. వయనాడ్‌ విపత్తుపై చర్చ జరుపుతున్నారు.

వయనాడ్‌కు రాహుల్‌ గాంధీ చేరుకున్నారు. 
రాహుల్‌ వెంట ప్రియాంక
బాధితులకు రాహుల్‌ గాంధీ పరామర్శించనున్నారు.

 

  • వయనాడ్‌లోని కొండచరియలు విరిగినపడిన ప్రాంతంలో సీఎం పినరయి విజయన్‌ ఏరియల్‌ సర్వే చేపట్టారు.
  • మేజర్‌ జనరల్‌ ఇంద్రబాలన్‌ సాయం తీసుకున్న సీఎం పినరయి విజయన్‌

మరోపక్క.. బాధిత గ్రామాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వర్షం కాస్త తెరిపి ఇచ్చినప్పటికీ నడుం లోతుకి పైగా కూరుకుపోయిన బురదలో విపత్తు నిర్వహణ బృందాలు, ఆర్మీ, సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయి. 


వయనాడ్‌కు సీఎం విజయన్‌
154 మృతదేహాలను జిల్లా అధికారులకు అప్పగించాం
శిథిలాల కింద దొరికిన మృతదేహాలను జెనెటిక్‌ శాంపిళ్లను సేకరిస్తున్నాం
సీఎం పినరయి విజయన్‌ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ సహాయం కోరారు
ఆయన ఇవాళ వయనాడ్‌లో పర్యటిస్తారు

:::కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్‌

ప్రతిపక్షనేత, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి వయనాడు బయలుదేరారు. రాహుల్‌ గాంధీతో పాటు ఆయన సోదరి,  ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా కూడా ఉన్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో పర్యటించనున్న రాహుల్‌.. రిలీఫ్‌క్యాంప్‌లో, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. 

కేరళ వయనాడ్‌ జిల్లా మెప్పాడి, మందక్కై, చూరాల్‌మల, అట్టామల, నూల్‌పుజా గ్రామాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండ చరియలు విరిగిపడి గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల మంది బురద మట్టిలో కూరుకుపోయారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement