priyanka gandi
-
Wayanad Landslides: బెయిలీ వంతెన నిర్మాణం పూర్తి: సీఎం పినరయి
Updatesవయనాడ్ కొండచరియలు విరిగిపడిన విపత్తులో మృతుల సంఖ్య 288కి చేరింది. మరో 200 మంది జాడ తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు 219 మంది గాయాలతో చికిత్స పొందుతున్నట్లు కేరళ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి.. తీవ్ర ప్రాణ నష్టాన్ని మిగిల్చిన ప్రాంతాన్ని ఇవాళ రాహుల్ గాంధీ పర్యటించారు. చూర్మలాలో ఆయన తన సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. 288 మంది మృతిచెందగా, వెయ్యి మందిని కాపాడారు. వయనాడ్ విపత్తుపై అఖిలపక్ష సమావేశం జరిగింది: సీఎం పినరయి విజయన్ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలతో కలిసి చర్చించాం.శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించడంమైనే మేము దృష్టి పెట్టాం. ఆర్మీ సిబ్బంది కృషిని అభినందిస్తున్నాను. చాలా మందిని రక్షించినట్లు వారు తెలిపారు. మట్టి, బురద కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు యంత్రాలను కిందకు దింపడం కష్టతరంగా ఉండడంతో వంతెన నిర్మాణం చేస్తున్నారు. బెయిలీ వంతెన నిర్మాణం చాలా వరకు పూర్తయింది.గల్లంతైన వారి కోసం నదిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రక్షించిన వారిని తాత్కాలికంగా శిబిరాలకు తరలిస్తున్నారు. పునరావాస పనులు త్వరగా జరుగుతున్నాయి. Wayanad landslide | Kerala CM Pinarayi Vijayan says "A high-level meeting was held today. After that political party leaders meeting was also held. The opposition leaders also attended the meeting. Our focus is to rescue those who were isolated. I appreciate the efforts of the… pic.twitter.com/G40UffRpiT— ANI (@ANI) August 1, 2024సీఎం పినరయి విజయన్ వయనాడ్‌లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. వయనాడ్ విపత్తుపై చర్చ జరుపుతున్నారు.#WATCH | Wayanad Landslide: Kerala CM Pinarayi Vijayan chairs an all-party meeting in Wayanad pic.twitter.com/PLpNeYnv5s— ANI (@ANI) August 1, 2024వయనాడ్‌కు రాహుల్ గాంధీ చేరుకున్నారు. రాహుల్ వెంట ప్రియాంకబాధితులకు రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు.#WATCH | Kerala: Congress leader & Lok Sabha LoP Rahul Gandhi and Congress leader Priyanka Gandhi Vadra arrive at Kannur airportThey will visit Wayanad to take stock of the situation of the constituency which has been rocked by massive landslides leading to 167 deaths. pic.twitter.com/sKlKnc4sBo— ANI (@ANI) August 1, 2024 వయనాడ్‌లోని కొండచరియలు విరిగినపడిన ప్రాంతంలో సీఎం పినరయి విజయన్ ఏరియల్ సర్వే చేపట్టారు.మేజర్ జనరల్ ఇంద్రబాలన్ సాయం తీసుకున్న సీఎం పినరయి విజయన్మరోపక్క.. బాధిత గ్రామాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వర్షం కాస్త తెరిపి ఇచ్చినప్పటికీ నడుం లోతుకి పైగా కూరుకుపోయిన బురదలో విపత్తు నిర్వహణ బృందాలు, ఆర్మీ, సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. వయనాడ్‌కు సీఎం విజయన్154 మృతదేహాలను జిల్లా అధికారులకు అప్పగించాంశిథిలాల కింద దొరికిన మృతదేహాలను జెనెటిక్ శాంపిళ్లను సేకరిస్తున్నాంసీఎం పినరయి విజయన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ సహాయం కోరారుఆయన ఇవాళ వయనాడ్‌లో పర్యటిస్తారు:::కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్#WATCH | Kerala: Search and rescue operations continue at landslide-affected Chooralmala in Wayanad. The death toll stands at 167. pic.twitter.com/vEPjtzyK94— ANI (@ANI) August 1, 2024ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి వయనాడు బయలుదేరారు. రాహుల్ గాంధీతో పాటు ఆయన సోదరి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా కూడా ఉన్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో పర్యటించనున్న రాహుల్.. రిలీఫ్క్యాంప్లో, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. #WATCH | Congress leader & Lok Sabha LoP Rahul Gandhi along with Congress leader Priyanka Gandhi Vadra arrives at Delhi airport, they'll shortly leave for Wayanad, Kerala.Bothe the Congress leaders will visit Wayanad to take stock of the situation of the constituency which has… pic.twitter.com/7u3wLfSb21— ANI (@ANI) August 1, 2024కేరళ వయనాడ్ జిల్లా మెప్పాడి, మందక్కై, చూరాల్మల, అట్టామల, నూల్‌పుజా గ్రామాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండ చరియలు విరిగిపడి గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల మంది బురద మట్టిలో కూరుకుపోయారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. -
గాజాపై ఇజ్రాయెల్ దాడులు అనాగరికం: ప్రియాంకా గాంధీ
ఢిల్లీ: గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌పై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా మండిపడ్డారు. గాజా విషయంలో ఇజ్రాయెల్ ప్రభుత్వ తీరును ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాలని ఆమె ఎక్స్ వేదికగా శుక్రవారం పిలుపునిచ్చారు.‘ఇజ్రాయెల్ పౌరులు కూడా హింస, ద్వేషాన్ని నమ్మరు. గాజాపై ఇజ్రాయెల్ దాడులను ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలు తీవ్రంగా ఖండించాలి. ఇది ప్రపంచంలోని ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత. ఇజ్రాయెల్ చర్యలు ఆమోదించదగినవి కావు. గాజాలో జరుగుతున్న భయంకరమైన మారణహోమం అందరూ ఖండించాలి. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు అనాగరికం. గాజాపై దాడులను ఇజ్రాయెల్ ప్రధాని అనాగారికత, నాగరికత మధ్య ఘర్షణ అని అంటున్నారు. కానీ, ఆయన, ఆయన ప్రభుత్వమే చాలా అనాగరికమైంది’అని ప్రియాంకా గాంధీ అన్నారు.గత పది నెలల నుంచి హమాస్ మిలిటెంట్లను ఏరివేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై యుద్దం చేస్తోంది. ఇప్పటివరకు 40 వేల మంది గాజా పౌరులు మృతి చెందారు. ప్రపంచంలోని పలు దేశాలు కాల్పుల విరమణ చేపట్టలాని కోరుతున్నా.. అమెరికా పర్యటనలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం గాజాపై యుద్ధాన్ని సమర్ధించుకోవటం గమనార్హం. -
అప్పుడు మోదీ చేసిందేంటీ? బీజేపీకి కాంగ్రెస్ కౌంటర్
ఢిల్లీ: వయనాడ్ పార్లమెంట్ స్థానంలో ప్రియాంకా గాంధీ వాద్రా పోటీ చేస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ వారసత్వ రాజకీయలకు తెరలేపిందని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ద్రోహం చేస్తోందని మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మండిపడ్డారు. ‘‘ కాంగ్రెస్ పార్టీ వయనాడ్ ప్రజల మీద ఒక నేత తర్వాత మరో నేతను రుద్దుతూ వారసత్వ రాజకీయాలు చేస్తోంది. రాహుల్ గాంధీ మరో స్థానం నుంచి పోటీ చేస్తారనే విషయం దాచిపెట్టడం సిగ్గుచేటు. ఈ విధానాల వల్లే రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మూడు ప్రధాన ఎన్నికల్లో ఓడిపోయింది’’ అని ‘ఎక్స్’ వేదికగా విమర్శలు చేశారు. బీజేపీ నేత చేసిన విమర్శలకు కాంగ్రెస్ ధీటుగా కౌంటర్ ఇచ్చింది.There is shamelessness and there is Cong type of shamelessness - imposing one member after another of their dynasty on voters of Wayanad - after shamelessly hiding the fact that Rahul was contesting from another constituency.This pattern of betrayal is reason why Cong has seen… https://t.co/W6hKnhKMtA— Rajeev Chandrasekhar 🇮🇳 (@RajeevRC_X) June 17, 2024 ‘‘2014లో వారణాసి నుంచి కూడా పోటీ చేసిన నరేంద్ర మోదీ.. వడోదర ఓటర్ల వద్ద దాచిపెట్టటం సిగ్గుచేటు కాదా?’’ అని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ‘ఎక్స్’లో కౌంటర్ వేశారు.Like @narendramodi ‘shamelessly’ concealed from the voters of Vadodara that he will be contesting from Varanasi too, in 2014? https://t.co/VJhntkmRPR— Pawan Khera 🇮🇳 (@Pawankhera) June 17, 20242014లో వడోదర, వారణాసి రెండు స్థానాల్లో మోదీ పోటీ చేసి గెలుపొందారు. ఆయన వడోదర స్థానాన్ని వదలుకున్నారు. తాజాగా రాహుల్ గాంధీ సైతం వయనాడ్, రాయ్‌బరేలీ రెండు స్థానాల్లో పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం ఆయన వాయనాడ్ స్థానాన్ని వదులుకోవటంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రియాంకా గాంధీని పోటీకి దింపింది. అయితే ఇదే మొదటి ప్రత్యక్ష ఎన్నికల పోటీ కావాటం గమనార్హం.వాయనాడ్ నుంచి ప్రియంకాను బరిలోకి దించిన కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది. కాంగ్రెస్ వారస్వత రాజకీయాలకు ఇదే అసలైన నిదర్శనం అంటూ మండిపడుతోంది. కాంగ్రెస్ పార్టీ కాదు.. ఫ్యామిలీ కంపెని అని సెటైర్లు వేస్తోంది. -
కర్మ మీకోసం ఎదురుచూస్తోంది!
న్యూఢిల్లీ: భారత దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ అవినీతిపరుడిగా అంతమయ్యారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. ‘మోదీజీ.. యుద్ధం ముగిసిపోయింది. కర్మ ఫలితం మీకోసం ఎదురుచూస్తోంది. మీ గురించి మీ మనసులో ఉన్న భావాలను నా తండ్రిపై రుద్దడం ద్వారా మీరు తప్పించుకోలేరు. మీకో పెద్ద కౌగిలింత, ప్రేమతో.. రాహుల్’ అని ట్వీట్ చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో యూపీలో శనివారం ప్రచారంలో పాల్గొన్న మోదీ రాహుల్‌గాంధీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘మీ తండ్రి రాజీవ్‌గాంధీని ఆయన అనుచరులంతా ‘మిస్టర్ క్లీన్‘గా అభివర్ణించేవారు. చివరకు ఆయన నంబర్ 1 అవినీతిపరుడిగా అంతమయ్యారు’ అని తీవ్రవ్యాఖ్యలు చేశారు. మోదీ వ్యాఖ్యలపై ప్రియాంకా గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ‘అమరుల పేర్లు చెప్పి ప్రజలను ఓట్లడిగే మోదీ పిచ్చిపిచ్చిగా మాట్లాడారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ మంచి వ్యక్తిని అవమానించారు. అమేథీ ప్రజల సేవలోనే రాజీవ్ ప్రాణలు అర్పించారు. ఆ ప్రజలే మోదీకి బుద్ధి చెబుతారు. మోదీజీ.. మీలాంటి మోసకారుల్ని దేశం ఎన్నటికీ క్షమించదు’ అని విమర్శించారు. సభ్యత, సంస్కారాల విషయంలో మోదీ అన్ని హద్దులు దాటేశారని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ వ్యాఖ్యలపై ఓ గుజరాతీగా సిగ్గుపడుతున్నానని రాజీవ్ స్నేహితుడు, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు. మోదీ వ్యాఖ్యలపై ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
మోదీకి ట్రిపుల్ సవాల్!
వాళ్లు ముగ్గురూ ముగ్గురే. ఒక్కొక్కరు ఒక్కో సామాజిక వర్గానికి చెందినవారు. అయితేనేం అత్యంత శక్తిమంతమైన మహిళలు. పశ్చిమబెంగాల్లో ఎర్రకోటను బద్దలు కొట్టి 34 ఏళ్ల కమ్యూనిస్టుల పాలనకు తెరదించి, ఫైర్ బ్రాండ్‌గా ఎదిగిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎవరి ఊహకూ అందని విధంగా దళితులు, అగ్రవర్ణాల అరుదైన సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాతో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్ని శాసించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి, కాంగ్రెస్ పార్టీకి దిక్సూచిగా ప్రధాన కార్యదర్శి హోదాలో రాజకీయ రణక్షేత్రంలోకి దిగుతున్న ప్రియాంక గాంధీ.. ఈ ముగ్గురమ్మలు ఈసారి ఎన్నికల్లో ప్రధాని మోదీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తారా? ఈ ముగ్గుర్నీ ఎదుర్కోవడమే మోదీ ముందున్న అతి పెద్ద సవాలా? ఇప్పుడివే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మమత, మాయావతిలు ప్రత్యర్థులు విలవిల్లాడేలా రాజకీయ వ్యూహాలను రచించడంలో దిట్టలు. ఎన్డీయేతర ప్రభుత్వం ఏర్పాటైతే ప్రధాని పదవి రేసులో ముందున్నవారు. ప్రియాంకకు రాజకీయ అనుభవం అంతగా లేకపోయినప్పటికీ నాన్నమ్మ ఇందిరాగాంధీ పోలికల్ని పుణికిపుచ్చుకోవడంతో ప్రజల్లో ఆమెకున్న ఛరిష్మా వేరు. మాయావతి ఢిల్లీ పీఠానికి దగ్గర దారిగా భావించే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 2014 ఎన్నికల్లో ఏకంగా 71 స్థానాలను గెలుచుకుంది. ఈస్థాయి విజయాన్ని ఆ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలైన బీఎస్పీ, ఎస్పీ జీర్ణించుకోలేకపోయాయి. ఈసారి మోదీని గద్దె దించడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు చేతులు కలిపాయి. కాంగ్రెస్ కూడా తమకు మిత్రపక్షమేనన్న పరోక్ష సంకేతాలు పంపుతూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గాలైన రాయ్‌బరేలీ, అమేథీ నియోజకవర్గాల్లో పోటీకి కూడా దిగడం లేదు. ఎన్నికల అనంతరం పొత్తులపై కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ మధ్య స్పష్టమైన అవగాహన ఉంది. పైపెచ్చు మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఎస్పీ మద్దతు కూడా తెలుపుతోంది. 63 ఏళ్ల వయసున్న మాయావతి.. మోదీకి చెక్ పెట్టడం కోసం తనకు ఆగర్భ శత్రువైన ఎస్పీతో కూడా చేతులు కలిపారు. మమతా బెనర్జీ ఇక అన్నీ కలిసి వస్తే ప్రధాని పీఠంపై కూర్చోవాలని కలలు కంటున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మోదీ పేరు చెబితేనే మండిపడుతున్నారు. ఒకప్పుడు బీజేపీతో కలిసి పోటీచేసి రైల్వే మంత్రిగా కూడా పనిచేసిన మమత ఈ ఎన్నికల్లో బీజేపీపై ఏ మాత్రం మమత చూపించడం లేదు. గత నెలలోనే కోల్‌కతాలో బీజేపీ వ్యతిరేక ర్యాలీ నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఎన్డీయే వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. కాంగ్రెస్‌తో నేరుగా ఎలాంటి పొత్తు లేకపోయినప్పటికీ మోదీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి ఆమె ఎవరితో చేతులు కలిపేందుకైనా సిద్ధమవుతున్నారు. ప్రియాంక గాంధీ ఇక రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలతో మంచి జోష్ మీదున్న కాంగ్రెస్ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మోదీ హవాకు చెక్ పెట్టడం కోసమే తమ పార్టీ తురుపు ముక్క ప్రియాంకను రంగంలోకి దించుతోంది. యూపీలో ఒకప్పుడు కాంగ్రెస్‌కు సంప్రదాయంగా మద్దతునిచ్చే బ్రాహ్మణులు, ఠాకూర్లు ఇటీవల కాలంలో బీజేపీ వైపు మళ్లిపోయారు. ప్రియాంక రాకతో వారు కాంగ్రెస్ గూటికి తిరిగి వస్తారన్న ఆశలు పార్టీ నేతల్లో ఉన్నాయి. ఇక ఎస్పీ, బీఎస్పీ పొత్తుతో దళితులు, ముస్లింలు ఆ కూటమికే మద్దతు పలికే అవకాశం ఉంది. ఇవన్నీ బీజేపీ విజయావకాశాల్ని దెబ్బ తీస్తుందనే అంచనాలున్నాయి. విపక్షాల్లోనే ఎక్కువ ఎన్డీయేతో పోల్చి చూస్తే విపక్షపార్టీల్లోనే శక్తిమంతమైన మహిళా నేతలు ఉన్నారు. సహజంగానే వారివైపు మహిళా ఓటర్లు మొగ్గు చూపించే అవకాశం ఉంది. ఈసారి ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న మహిళలు ఎటువైపు మొగ్గు చూపిస్తారో వారే అధికార అందలాన్ని అందుకునే అవకాశమైతే ఉంది. ‘‘బీజేపీ చాలా ఆందోళనలో ఉంది. మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోవడంతో ఆత్మవిశ్వాసం కోల్పోయింది. విపక్షాల్లో ఉన్న శక్తిమంతమైన మహిళలే మోదీకి ఈ ఎన్నికల్లో ముప్పుగా మారుతారు‘‘ అని బీజేపీకి గుడ్ బై కొట్టేసిన యశ్వంత్ సిన్హా అభిప్రాయపడ్డారు. మాయావతి, మమతా బెనర్జీ వంటి నేతల పట్ల కేవలం మహిళా ఓటర్లే మొగ్గు చూపిస్తారనుకోవడం సరికాదని అంటున్నారు బీఎస్పీ అధికార ప్రతినిధి సుధీంద్ర భదోరియా. బీజేపీవైపే ఉన్నారా? పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలతో కొంత అపప్రధను మూటకట్టుకున్నప్పటికీ మోదీ ఇప్పటికీ దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడే. ఓ ముగ్గురు మహిళలు చేతులు కలిపినంత మాత్రాన మోదీకి వచ్చే ముప్పేమీ లేదని బీజేపీ నేతలు భావిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఆడవాళ్ల కోసం టాయిలెట్ల నిర్మాణం, సబ్సిడీ రేట్లకే గ్యాస్ సిలిండర్లు వంటివి మోదీ సర్కార్ పట్ల మహిళల్లో సానుకూలతనే పెంచాయి. అంతే కాకుండా మోదీ తన కేబినెట్లో కూడా మహిళలకు సముచిత స్థానాన్ని కల్పించారు. మొత్తం 26 మంది మంత్రులున్న కేబినెట్లో ఆరుగురు మహిళలున్నారు. ఇవన్నీ మోదీ ప్రభుత్వానికి కలిసొచ్చే అంశాలేనని మహిళలు తమవైపే ఉంటారన్న ధీమాలో బీజేపీ ఉంది. -
సోనియా కాదు...ప్రియాంకా రాస్తుందట!
అమ్మ ఆత్మకథ రాసేందుకు కుమార్తె సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇంతకీ ఎవరి ఆత్మ కథ ఎవరు రాస్తున్నారనే కదా.... ఇప్పటికే మీకు అర్థం అయ్యి ఉండాలి. ఓ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆత్మకథను ఆమె కుమార్తె ప్రియాంకా గాంధీ రాయనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సోనియానే స్వయంగా వెల్లడించినట్లు తెలుస్తోంది. కాగా అన్ని వాస్తవాలను ప్రజల ముందు పెట్టేందుకు తాను కూడా పుస్తకం రాస్తానని సోనియా రెండు రోజుల క్రితం వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మాజీ కేంద్ర మంత్రి నట్వర్‌సింగ్, సోనియా ప్రధాని కాలేకపోవడానికి రాహుల్ గాంధీనే కారణమనీ, తన నానమ్మ ఇందిరాగాంధీలా తన తల్లి సోనియా కూడా రాజకీయ కుట్రలకు బలైపోతారన్న ఆవేదనతోనే రాహుల్, తన తల్లి ప్రధాని కాకుండా అడ్డుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. దీనిపై సోనియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నా జీవిత చరిత్ర నేనే రాసుకుంటాను.. అందులో తానెందుకు ప్రధాని కాలేకపోయానో వెల్లడిస్తాను.. ఆ విషయమై ఇతరులెవరూ మాట్లాడకపోతేనే మంచిది అంటూ సోనియా నట్వర్‌సింగ్‌పై మండిపడ్డారు. ఇంతకీ నట్వర్‌సింగ్ వ్యాఖ్యలపై సోనియాగాంధీకి ఎందుకు అంత కోపమొచ్చినట్లు.? నిజంగానే సోనియా జీవిత చరిత్రను ప్రియాంకా గాంధీ రాస్తే అందులో అమ్మ ప్రధాని కాలేకపోవడానికి గల కారణాల్ని వివరిస్తారా.? అనేది వేచి చూడాల్సిందే. మరోవైపు సోనియా గాంధీ తన ఆత్మకథను తానే రాసుకుంటానన్న వ్యాఖ్యలపై నట్వర్ సింగ్ స్పందించారు. సోనియా నిర్ణయం సంతోషకరమన్నారు. ఆ ఆత్మకథ కోసం తాను ఎదురు చూస్తుంటానన్నారు. ప్రియాంకా గాంధీ తాజాగా తెరమీదకు రావటంతో ఆత్మకథ ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది.