న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం విచారణ కోసం ఈడీ ముందుకు హాజరయ్యారు. రాహుల్ వెంట ప్రియాంక గాంధీ కూడా ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు. అంతకముందు ఏఐసీసీ కార్యాలయం వద్ద రాహుల్ గాంధీ ధర్నాలో పాల్గొన్నారు. రాహుల్‌తోపాటు ధర్నాకు దిగిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా నిన్న(సోమవారం) రాత్రి 10 గంటల వరకు రాహుల్ గాంధీని ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.. కాసేపట్లో ఏఐసీసీ దగ్గర కాంగ్రెస్ నేతల భేటీ కానున్నారు. రెండో రోజు ఈడీ విచారణ, కాంగ్రెస్ నిరసనలు కొనిసాగిస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో ఆంక్షలు విధించారు. అక్బర్ రోడ్, జన్‌పథ్ మార్గాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
సంబంధిత వార్త: నేషనల్ హెరాల్డ్ కేసేంటి?.. ఈ ప్రశ్నలకు బదులేది?
Comments
Please login to add a commentAdd a comment