national hearald
-
నేషనల్ హెరాల్డ్ కేసులో నాకు ఈడీ నోటీసులు అందలేదు : అంజన్ కుమార్
-
రెండో రోజు ఈడీ విచారణకు రాహుల్ గాంధీ.. ఢిల్లీలో ఆంక్షలు
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం విచారణ కోసం ఈడీ ముందుకు హాజరయ్యారు. రాహుల్ వెంట ప్రియాంక గాంధీ కూడా ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు. అంతకముందు ఏఐసీసీ కార్యాలయం వద్ద రాహుల్ గాంధీ ధర్నాలో పాల్గొన్నారు. రాహుల్‌తోపాటు ధర్నాకు దిగిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా నిన్న(సోమవారం) రాత్రి 10 గంటల వరకు రాహుల్ గాంధీని ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.. కాసేపట్లో ఏఐసీసీ దగ్గర కాంగ్రెస్ నేతల భేటీ కానున్నారు. రెండో రోజు ఈడీ విచారణ, కాంగ్రెస్ నిరసనలు కొనిసాగిస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో ఆంక్షలు విధించారు. అక్బర్ రోడ్, జన్‌పథ్ మార్గాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. సంబంధిత వార్త: నేషనల్ హెరాల్డ్ కేసేంటి?.. ఈ ప్రశ్నలకు బదులేది? -
ఢిల్లీ: ఈడీ విచారణకు హాజరైన రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఈడీలోని ఇద్దరు అధికారులు రాహుల్ గాంధీని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈడీ ఆఫీసులు ముందు ఏఐసీసీ నిరసనలను చేపడుతోంది. ఈ క్రమంలో బషీర్‌బాగ్ ఈడీ ఆఫీస్ ముందు తెలంగాణ కాంగ్రెస్ నిరసన చేపట్టింది. కేంద్రం కక్ష సాధింపుల చర్యలను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేపట్టారు. అందులో భాగంగా నగరంలోని నెక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభించి ఈడీ కార్యాలయం వరకు కాంగ్రెస్ శ్రేణుల నిరసన చేపట్టారు. రాహుల్ విచారణ నేపథ్యంలో ఏఐసీసీ కార్యాలయం వద్ద భారీగా పోలీసుల మోహరించారు. రాహుల్ గాంధీకి మద్దతుగా ఆఫీస్‌కు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ , పలువురు కాంగ్రెస్ ఎంపీలు చేరుకున్నారు. కాగా నేషనల్ హెరాల్డ్ ఆస్తులను కాంగ్రెస్ ప్రాయోజిత యంగ్ ఇండియా సంస్థ ద్వారా అక్రమ పద్ధతిలో హస్తగతం చేసుకున్నారంటూ మనీ ల్యాండరింగ్ చట్టాల కింద ఈడీ కేసు నమోదుచేసి దర్యాప్తు కొనసాగిస్తున్న విషయం తెల్సిందే. ఈ కేసు నిమిత్తమే రాహుల్‌ని ఈడీ విచారించనుంది. చదవండి: ED Summons To Sonia Gandhi: సోనియాకు మరోసారి సమన్లు జారీ చేసిన ఈడీ -
కవిత బాలేకపోతే...
లక్నోలో 1938లో జవహర్లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన నేషనల్ హెరాల్డ్ ఆంగ్ల దినపత్రికకు 1946 నుంచీ సుమారు మూడు దశాబ్దాల పాటు తెలుగువాడైన పాత్రికేయ శిరోమణి మానికొండ చలపతిరావు సంపాదకుడిగా వ్యవహరించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించి పాత్రికేయ విలువలకు పట్టం కట్టేవారు. ఒకసారి ఏమైందంటే నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఓ ఆంగ్ల కవితను రాసి, ప్రచురించాలని ఎడిటర్ మానికొండ(ఎం.సి.)ను కోరింది. అందుకు ఆయన, ‘‘అమ్మా! నువ్వు ఉత్సాహంగా ఈ కవితను రాశావు. సంతోషమే. అయితే మరికొన్నాళ్లు సాధన చేయాల్సిన అవసరం ఉంది’’ అని జవాబిచ్చారు. పత్రికా ప్రమాణాల దృష్ట్యా కవితను ప్రచురించలేనని సున్నితంగా చిరునవ్వుతో చెప్పారు. ఇందిర కూడా నిరాశ చెందకుండా ఎడిటర్ క్యాబిన్ నుంచి నిష్క్రమించారు. - వాండ్రంగి కొండలరావు -
సోనియా, రాహుల్‌లకు ఊరట
-
సోనియా, రాహుల్‌కు ఊరట
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలకు ఊరట లభించింది. వ్యక్తిగత హాజరు నుంచి వీరిద్దరికీ ఢిల్లీ హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. సోనియా, రాహుల్ గురువారం పాటియాల కోర్టుకు హాజరుకావాలన్న మేజిస్ట్రేట్ ఆదేశాలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధిస్తూ కేసు విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన విరాళాలతో నేషనల్ హెరాల్డ్ ఆస్తులు కొనుగోలు చేశారంటూ BJP నేత సుబ్రహ్మణ్యస్వామి సోనియాపై కేసు దాఖలు చేశారు.