
లక్నోలో 1938లో జవహర్‌లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన నేషనల్ హెరాల్డ్ ఆంగ్ల దినపత్రికకు 1946 నుంచీ సుమారు మూడు దశాబ్దాల పాటు తెలుగువాడైన పాత్రికేయ శిరోమణి మానికొండ చలపతిరావు సంపాదకుడిగా వ్యవహరించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించి పాత్రికేయ విలువలకు పట్టం కట్టేవారు. ఒకసారి ఏమైందంటే నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఓ ఆంగ్ల కవితను రాసి, ప్రచురించాలని ఎడిటర్ మానికొండ(ఎం.సి.)ను కోరింది. అందుకు ఆయన, ‘‘అమ్మా! నువ్వు ఉత్సాహంగా ఈ కవితను రాశావు. సంతోషమే. అయితే మరికొన్నాళ్లు సాధన చేయాల్సిన అవసరం ఉంది’’ అని జవాబిచ్చారు. పత్రికా ప్రమాణాల దృష్ట్యా కవితను ప్రచురించలేనని సున్నితంగా చిరునవ్వుతో చెప్పారు. ఇందిర కూడా నిరాశ చెందకుండా ఎడిటర్ క్యాబిన్ నుంచి నిష్క్రమించారు.
- వాండ్రంగి కొండలరావు
Comments
Please login to add a commentAdd a comment