ఢిల్లీ: ఎన్నికల అంశాలపై ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు తాను సిద్ధమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో డిబేట్ చేయడానికి రాహుల్ గాంధీ ఏమైనా విపక్షాల కూటమికి పీఎం అభ్యర్థిగా ఉన్నారా? అని ప్రశ్నించారు. ఆమె ఓ జాతీయా మీడియాతో మాట్లాడారు.
‘మొదటిగా.. తమ కంచుకోట అని భావించే స్థానంలో ఓ సాధారణ బీజేపీ కార్యకర్తపై కూడా పోటీ చేసే ధైర్యం లేనివ్యక్తి ప్రగల్భాలు పలకడం మానుకోవాలి. రెండోది.. ప్రధానిమోదీతో భేటీ అయిన ఆయనతో డిబేట్ చేసే స్థాయి రాహల్ గాంధీకి ఉందా?. నేను సూటిగా అడుగుతున్నా.. రాహల్ గాంధీ ఏమైనా విపక్ష కూటమికి ప్రధాని అభ్యర్థినా?’’ అని స్మృతి ఇరానీ నిలదీశారు.
పలు లోక్‌సభ న్నికల అంశాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీతో బహిరంగ చర్చ ఆహ్వానానికి తాను సిద్ధమేనని శనివారం రాహుల్ గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే.
‘మా పార్టీ విజన్‌ను ప్రజలు అర్థం చేసుకోవడానికి ఈ డిబేట్ సాయం చేస్తుంది. సరైన సమాచారం ప్రజలకు చేరుతుంది’ అని రాహల్ గాంధీ అన్నారు. ఈ డిబేట్‌లో తాను లేదా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొనడానికి సిద్ధమని తెలిపారు. ఇక.. ఈ బహిరంగ చర్చకు.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బీ లోకూర్, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఏపీ షా, సీనియర్ జర్నలిస్టు ఎన్ రామ్ ఆహ్వానం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment