ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తరహాలో మారో యాత్ర చేపడతారని కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసందే. అయితే శనివారం రాహుల్ గాంధీ చేపట్టే యాత్రకు ‘భారత్ జోడో న్యాయ యాత్ర’గా నామకరణం చేస్తూ కాంగ్రెస్ చీఫ్ మళ్లికార్జున ఖర్గే ప్రకటించారు.
భారత్ జోడో యాత్ర లోగో, స్లోగన్‌ను ఖర్గే ఆవిష్కరించారు. ఈ యాత్రకు ‘భారత్ జోడో న్యాయ యాత్ర’గా నామకరణం చేసి.. ‘న్యాయం అందేవరకు’ అనే స్లోగన్‌ను పెట్టినట్లు తెలిపారు. ఇక.. ఈ జనవరి 14 నుంచి రాహుల్ గాంధీ చేపట్టే.. ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ మణిపూర్‌లోని ఇంఫాల్ నుంచి మహారాష్ట్రలోని ముంబై వరకు బస్సు యాత్రగా కొనసాగనుంది.
ये है 14 जनवरी, 2024 को मणिपुर से मुंबई तक शुरू होने जा रही भारतीय राष्ट्रीय कांग्रेस की भारत जोड़ो न्याय यात्रा का रूट मैप। @RahulGandhi 66 दिनों में 110 ज़िलों से गुज़रते हुए 6700 किलोमीटर से ज़्यादा की दूरी कवर करेंगे। यह पिछली भारत जोड़ो यात्रा की तरह ही प्रभावशाली और… pic.twitter.com/m3JeA3Nw4O
— Jairam Ramesh (@Jairam_Ramesh) January 4, 2024
చదవండి: Ayodhya: 22న అయోధ్యలో హైసెక్యూరిటీ.. భద్రతా బలగాలివే..
Comments
Please login to add a commentAdd a comment