మానవత్వంతో స్పందించిన సీఎం  | CM YS Jagan Mohan Reddy to visit Cyclone Michaung affected areas in AP Tirupati district | Sakshi
Sakshi News home page

మానవత్వంతో స్పందించిన సీఎం 

Published Sat, Dec 9 2023 5:50 AM | Last Updated on Sat, Dec 9 2023 4:46 PM

CM YS Jagan Mohan Reddy to visit Cyclone Michaung affected areas in AP Tirupati district - Sakshi

సీఎం జగన్‌కు కష్టాలు చెప్పుకొంటున్న కవిత

సాక్షి, తిరుపతి: ఆర్థిక సాయం కోసం ఆపన్న హస్తం కోరిన వారికి మానవత్వంతో స్పందించి వెంటనే ఆర్థిక సాయం అందించాలని తిరుపతి జిల్లా కలెక్టర్‌ వెంకటరమణారెడ్డిని సీఎం జగన్‌ ఆదేశించారు. స్థానికుల నుంచి వినతులను స్వీకరించి వాటినీ పరిష్కరించాలని ఆదేశాలిచ్చారు. తుపాను వల్ల పంటలు నష్టపోయిన బాధితులతో ముఖాముఖి కార్యక్రమంలో శుక్రవారం తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాళెంకు సీఎం వచ్చారు.

ఆయనను కుటుంబ యాజమానులను కోల్పోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పి.రమణమ్మ, ఐ.కవిత కలిసి తమకు సాయం చేయాలని కోరారు. దీంతో సత్వరమే స్పందించిన సీఎం..తిరుపతి జిల్లా కలెక్టర్‌ కే వెంకట రమణారెడ్డిని ఇరువురికీ ఆర్థిక సాయాన్ని అందజేయాలని ఆదేశించారు. సీఎం సూచనల మేరకు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డీకే బాలాజీ ఇద్దరు మహిళలరూ రూ.లక్ష వంతున చెక్కులను అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement