
తుపాను నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని..
సాక్షి, తాడేపల్లి: ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దూసుకొస్తున్న మాండూస్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రభావిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం తుపానుపై ఆయన తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి సమీక్ష నిర్వహించారు.
తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే పునరావాస కేంద్ర తరలింపుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు ఆయన సూచించారు. అలాగే రైతుల్లో కూడా ఈ తుపాను పట్ల అవగాహన కల్పించాలని, రైతు సహాయకారిగా ఉండాలని జగన్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకుండా నిరోధించాలని కోరారు. అన్ని శాఖల సమన్వయంతో.. పనిచేయాలని సీఎం జగన్ సూచించారు.
ఇదీ చదవండి: మాండూస్‌కి అర్థం తెలుసా?