
సాక్షి, తాడేపల్లి : మాండూస్ తుపాను రాక నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరిస్థితులను అధికారులను అడిగిన తెలుసుకున్న ఆయన.. ప్రభావిత ప్రాంతాలు, భారీ వర్షసూచన ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి సూచించారు. అవసరమైన పక్షంలో పునరావాస శిబిరాలను తెరిచి.. వారికి అన్నిరకాలుగా అండగా ఉండాలని తెలిపారు సీఎం జగన్.
మాండూస్ తుపాన్ ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాతో పాటు పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment