Immersion of crops in 5 lakh acres - Sakshi
Sakshi News home page

5 లక్షల ఎకరాల్లో పంటల మునక!

Published Fri, Jul 28 2023 3:39 AM | Last Updated on Fri, Jul 28 2023 8:01 PM

Immersion of crops in 5 lakh acres - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో వివిధ పంటలకు నష్టం వాటిల్లుతోంది. ఇప్పుడిప్పుడే వేసిన పంటలు నీటిలో మునిగిపోయాయి. వ్యవసాయ­శాఖ వేసిన అంచనా ప్రకారం దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంటలు నీటముని గాయి. నిజామాబాద్‌ జిల్లాలో 21,500 ఎకరా ల్లో పంట నష్టం జరిగినట్లు అక్కడి వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది.

అలాగే ఇతర ప్రాంతాల్లో సోయాబీన్, మొక్కజొన్న, పెసర సహా ఇతర పంటలు చేతికి వచ్చే పరిస్థితి లేదు. పత్తి కూడా చాలాచోట్ల నీటమునిగింది. మొలక స్థాయిలో ఉన్న పత్తి 10 రోజుల తర్వాత కూడా నీటిని తోడేస్తే నిలబడ­గలుగుతుందని... విత్తనాలు వేసిన చోట నేల మునిగితే మాత్రం అది భూమిలోనే కుళ్లిపోతుందని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

ప్రాథమిక స్థాయిలో నాట్లు పడినచోట్ల, వరినారు వరదలతో కొట్టుకుపోయింది. అయితే వరదల కారణంగా పూర్తిస్థాయిలో నష్టం అంచనాకు వ్యవసాయ సిబ్బం­ది క్షేత్రస్థాయికి వెళ్లలేకపోతున్నారని అధికారులు అంటున్నారు.

తెరిపినిస్తేనే వ్యవసాయానికి ఊపు...
ప్రస్తుత భారీ వర్షాలతో వ్యవసాయానికి ఊపు వచ్చింది. అయితే భారీ వరదల కారణంగా పంటలకు నష్టం తప్పడంలేదు. ఇప్పటివరకు రాష్ట్రంలో 68.80 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా పత్తి 40.73 లక్షల ఎకరాల్లో సాగవగా 15.63 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. సోయాబీన్‌ 4.14 లక్షల ఎకరాల్లో, కంది 3.82 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 3.62 లక్షల ఎకరాల్లో సాగైంది.

పత్తికి నష్టం జరిగితే తెరిపినిచ్చాక మరోసారి విత్తుకోవల్సి రానుంది. మొక్కజొన్న, సోయాబీన్‌ వంటి పంటలు దెబ్బతింటే మరోసారి వేసుకొనే పరిస్థితి ఉండదని అధికారులు అంటున్నారు. పత్తికి ఆగస్టు 10లోగా వేసుకొనే వెసులుబాటు ఉంటుందని, కొందరు రైతులు మూడోసారి కూడా వేసుకొనే పరిస్థితి తలెత్తుతుందని చెబుతున్నారు.

ఏదైనా ప్రస్తుత వర్షాలు ఆగిపోతేనే పంటలను కాపాడుకోవచ్చని పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుత వర్షాల వల్ల వరి విస్తీర్ణం మాత్రం మరింత పెరుగుతుందని... ఈసారి కూడా వరి వరిసాగు రికార్డు స్థాయిలో జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

వ్యవసాయ సిబ్బంది సెలవుల రద్దు?
వర్షాలు, వరదల కారణంగా జిల్లాల్లో వ్యవసాయా­ధి­కారుల సెలవులు రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement