పులివెందుల : వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం బ్రాహ్మణపల్లెలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం వల్ల ఆరెకరాల్లోని అరటి పంట పూర్తిగా దగ్ధమైంది. వివరాల్లోకి వెళ్తే... బ్రాహ్మణపల్లె గ్రామంలోని రైతు మల్‌రెడ్డికి చెందిన అరటి తోటలో సోమవారం మధ్యాహ్నం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, పులివెందుల మునిసిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్‌రెడ్డి సందర్శించారు.