ముంబై: సాక్షాత్తు రాష్ట్రాన్ని ఏలుతున్న ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ భార్య సత్వశీల రైతు అవతారమెత్తారు. ఇదేమిటనుకుంటున్నారా? ఇది నిజమే?. 2011-12 కాలంలో పశ్చిమ మహారాష్ట్రలో ఏర్పడిన కరువు వల్ల పంటలు కోల్పోయిన రైతులకు సర్కార్ పంపిణీ చేసిన నష్టపరిహారం అందుకున్న వారిలో సత్వశీల పేరు కూడా ఉంది. ‘కరువు వల్ల వాటిల్లిన పంట నష్టంపై సర్వే చేశాం. కలెక్టర్ నేతృత్వంలోని ఓ కమిటీ చేసిన ప్రతిపాదనల ప్రకారం సత్వశీలకు రూ.మూడు వేల నష్టపరిహారాన్ని చెల్లించాం. అలాగే ఆమె తల్లి సోదరుడికి కూడా చెక్ అందించాం.
ఆ ప్రాంతంలో నాలుగువేల మంది పంట కోల్పోయారని అంచనా వేశాం. వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బు డిపాజిట్ చేశామ’ని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. చవాన్ భార్య సత్వశీలకు సాంగ్లీలోని బేదగ్ గ్రామంలో 2.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని చెప్పారు. అయితే నష్టపరిహారానికి సంబంధించి ఆమె నుంచి ఏ దరఖాస్తు రాలేదని చెప్పిన సదరు అధికారి సాధారణంగానే జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో ఉన్న ఖాతాలో డబ్బు డిపాజిట్ అయ్యిందని వివరించారు. అయితే అధికారుల పనితీరుతో రైతులు నివ్వెరపోయారు.
సీఎం భార్యకు పంట నష్టపరిహారం
Published Mon, Nov 25 2013 11:26 PM | Last Updated on Mon, Oct 8 2018 5:57 PM
Advertisement