'నష్టపోయిన రైతులకు.. రెట్టింపు పరిహారం'
కరీంనగర్: పంట నష్టపోయిన రైతులకు గతంలో కంటే రెట్టింపు పరిహారం చెల్లించి ఆదుకుంటామని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు. బుధవారం ఆయన కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల డివిజన్లో పంట నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో ఉన్న నిబంధనలను కేంద్రం సడలించినట్టు చెప్పారు.
అలాగే 30శాతం పంట నష్టాపోయిన రైతులకు కొత్త నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని దత్తాత్రేయ కోరారు.