Fact Check: Eenadu Fake News On Crop Loss Compensation In AP, Details Inside - Sakshi
Sakshi News home page

రైతులెవరో తెలియదా రామోజీ?.. ఇంకెన్నాళ్లు ఈ మొద్దునిద్ర?

Published Tue, May 2 2023 9:00 AM | Last Updated on Tue, May 2 2023 12:14 PM

Fact check: Eenadu Fake News On Crop Loss Compensation - Sakshi

సాక్షి, అమరావతి: నిన్న వర్షం కురిస్తే.. ఈ రోజుకల్లా నష్ట పరిహారం ఇవ్వాలంటూ గగ్గోలు పెడుతోంది ఈనాడు! పంట నష్టం అంచనాలతో పనిలేకుండా క్షణాల్లో పరిహారం ఇవ్వాలంటూ తప్పుడు కథనాలు ప్రచురించటాన్ని... అసలు వర్షం కురవడమే ఈ ప్రభుత్వ వైఫల్యం అన్నట్లుగా బురద జల్లటాన్ని ఏమనుకోవాలి? వర్షాలు, వరదలు, తుపాన్లు.. విపత్తు ఏదైనా ఆగమేఘాలపై స్పందిస్తూ నష్ట పోయిన ప్రతి ఎకరాకు, దెబ్బతిన్న ప్రతీ రైతన్నకూ సీజన్‌ ముగియకుండానే పరిహారం (ఇన్‌పుట్‌ సబ్సిడీ) అందిస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోంది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం. పైసా కూడా బకాయి పెట్టకుండా అర్హులెవరైనా మిగిలిపోతే వెతికి మరీ లబ్ధి చేకూరుస్తోంది. 

లెక్క తెలియదా రామోజీ?.. 37,371 మందికి రూ.34.25 కోట్లు.. 
పంట నష్ట పరిహారాన్ని (ఇన్‌పుట్‌ సబ్సిడీ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిర్ణయాన్ని బట్టి పంటల వారీగా నిర్ణయిస్తారు. ఏదైనా వైపరీత్యం సంభవిస్తే తొలుత పంటల వారీగా ప్రాథమిక అంచనా వేస్తారు. తర్వాత క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం నిబంధనల మేరకు 33 శాతానికి పైగా మునిగిపోయి దెబ్బతిన్న పంటలను పరిగణనలోకి తీసుకొని తుది అంచనాలను రూపొందిస్తారు. అదే కరువు కాటకాల వేళ.. వర్షపాతం, డ్రై స్పెల్స్, భూగర్భ జలాలు, రిజర్వాయర్ల నీటి నిల్వల సూచిక, పంట దిగుబడి, పంట నష్టం లాంటి ప్రామాణికాల ఆధారంగా కరువు మండలాలను ప్రకటించి తదనుగుణంగా పరిహారాన్ని లెక్కిస్తారు. ఇప్పుడు రబీ పంటలు చేతికొచ్చే వేళ అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇది ఎవరూ ఆపలేని వాస్తవం! గత నెలలో వర్షాల వల్ల నష్టపోయిన 37,371 మంది రైతులకు మే నెలలో రూ.34.25 కోట్లు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పంట నష్టాన్ని అంచనా వేసేందుకు బృందాలు రంగంలోకి దిగాయి. 

బాబు ఎగ్గొట్టిన బకాయిలు రూ.5,942 కోట్లు 
చంద్రబాబు హయాంలో కరువొచ్చినా.. వరదలొచ్చినా.. అకాల వర్షాలతో రైతులు పంట నష్టపోతే రెండేళ్ల తర్వాత కానీ పరిహారానికి దిక్కులేని దుస్థితి. 2014–15లో కర్నూలు జిల్లాలో అక్టోబర్, డిసెంబర్‌లో వర్షాలు కురిస్తే 2016 జూలైలో అంటే దాదాపు రెండేళ్ల తర్వాతగానీ కరుణించలేదు. అది కూడా అరకొరగానే పంట నష్టపరిహారం అందించారు. 2014లోనే కర్నూలు జిల్లాలో కరువు వస్తే 2017లో కరువు భృతినిచ్చారు. 2015 ఏప్రిల్‌లో అకాల వర్షాలు పడితే ఏడాది తర్వాత అంటే 2016 ఆగస్టులో పరిహారాన్నిచ్చారు. 2015లో కరువు వస్తే నవంబర్‌ 2016లో భృతినందించారు.  

అనంతపురం జిల్లాలో 2018 ఖరీఫ్‌లో భారీగా పంట నష్టం జరిగితే పూర్తిగా ఎగ్గొట్టారు. ఐదేళ్లలో 24.80 లక్షల మందికి రూ.2,558.07 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని ఎగ్గొట్టిన ఘన చరిత్ర చంద్రబాబుది. ఒక్క ఇన్‌పుట్‌ సబ్సిడీనే కాకుండా బాబు ఐదేళ్ల పాలనలో సబ్సిడీ విత్తనాలకు సంబంధించి రూ.282.71 కోట్లు, సున్నా వడ్డీ పంట రుణ రాయితీ  రూ.1,180.66 కోట్లు, పంటల బీమా పరిహారం రూ.715.84 కోట్లు, ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేíÙయా రూ.23.70 కోట్లు, యాంత్రీకరణ కోసం రూ.221.07 కోట్లు, ధాన్యం కొనుగోలు బకాయిలు రూ.960 కోట్లు కలిపి ఏకంగా రూ.5,942.05 కోట్లు ఎగ్గొడితే ఈనాడు సింగిల్‌ కాలం వార్త రాసిన పాపాన పోలేదు. ఈ బకాయిల్లో ఇప్పటికే 46.17 లక్షల మంది రైతులకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రూ.2,890.85 కోట్లు చెల్లించింది. వీటితో పాటు చంద్రబాబు ఎగ్గొట్టిన వ్యవసాయ విద్యుత్‌ బకాయిలు రూ.8,845 కోట్లు కూడా ఈ ప్రభుత్వం వచ్చాకే చెల్లించింది. 

టమాటా క్వింటాల్‌ రూ.530 పైమాటే 
టమాటాలకు ధర లేక రైతులు గగ్గోలు పెడుతున్నారంటూ ఈనాడు కుళ్లు రాతలు రాస్తోంది. రాష్ట్రంలో ప్రధాన మార్కెట్లైన కలికిరి, వాలీ్మకిపురం, ములకలచెరువు, మదనపల్లి, పలమనేరు, వి.కోట, పుంగనూరు మార్కెట్లలో తాజాగా టమాటా కనిష్ట ధర క్వింటా రూ.530 – రూ.540 ఉండగా గరిష్టంగా రూ.670 – రూ.700 పలుకుతోంది. ఉల్లిపాయలు కూడా కనిష్టంగా క్వింటాల్‌ రూ.540 ఉండగా గరిష్టంగా రూ.780 పలుకుతోంది. గత నెల రోజులుగా ఏ మార్కెట్‌లోనూ ఫైన్‌ క్వాలిటీ టమాటాను కిలో రూ.2 చొప్పున అమ్ముకున్న దాఖలాలు లేవు. 

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక ధరలు పతనమైన ప్రతీసారి మార్కెట్‌లో జోక్యం చేసుకుంటూ రూ.1.28 కోట్ల విలువైన 1,425 టన్నుల టమాటాను సేకరించింది. మొక్కజొన్న గత మూడేళ్లుగా ఎమ్మెస్పీకి మించి ధర పలుకుతోంది. క్వింటా ఎమ్మెస్పీ రూ.1,962 కాగా ప్రస్తుతం మార్కెట్‌లో ఫైన్‌ క్వాలిటీ మొక్కజొన్న గరిష్టంగా రూ.2,500 పలుకుతోంది. మార్కెటింగ్‌ శాఖ నిత్యం సీఎం యాప్‌ ద్వారా ధరలను పర్యవేక్షిస్తోంది. ఈ ఏడాది 16.63లక్షల టన్నుల దిగుబడులు అంచనా వేయగా ఇప్పటికే 60 శాతానికి పైగా మార్కెట్‌లోకి వచి్చంది. టీడీపీ హయాంలో రూ.427.10 కోట్ల విలువైన 3.19 లక్షల టన్నుల మొక్కజొన్న మాత్రమే సేకరించగా, గత నాలుగేళ్లలో ఏకంగా రూ.2,020.52 కోట్ల      విలువైన 9.13 లక్షల టన్నులు సేకరించడం గమనార్హం. ఇప్పటికే ఎమ్మెస్పీ కంటే తక్కువగా ఉన్న శనగలు కొనుగోలు చేస్తుండగా పసుపు కొనుగోలుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.

జగన్‌ పాలనలో ఏ సీజన్‌ లో పరిహారం.. ఆ సీజన్‌లోనే..
వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి పరిహారాన్ని అదే సీజన్‌ ముగిసేలోగా అంటే రెండు నెలల వ్యవధిలోనే అందిస్తున్నారు. 2019లో వరదలొస్తే ఏప్రిల్‌ 2020లో రైతులకు పరిహారం అందించారు. 2020 ఏప్రిల్‌–సెపె్టంబర్‌ మధ్య కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అదే ఏడాది అక్టోబర్‌లో పరిహారాన్ని జమ చేశారు. అక్టోబర్‌ 2020లో కురిసిన వర్షాలకు సంబంధించి నవంబర్‌లో చెల్లించారు. 2020 నవంబర్‌లో నివర్‌ తుపాన్‌ వల్ల దెబ్బతిన్న రైతులకు డిసెంబర్‌లో పరిహారం అందించారు. 

తిత్లీ తుపాన్‌ సమయంలో సంభవించిన నష్టపరిహారాన్ని చంద్రబాబు ఎగ్గొడితే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చాక ఇన్సూరెన్స్‌ కంపెనీలతో మాట్లాడి ప్రభుత్వ పరంగా రూ.182 కోట్లు రైతులకు పంపిణీ చేశారు. 2022 డిసెంబర్‌లో మాండూస్‌ తుపాన్‌ బాధిత రైతులకు 2023 ఫిబ్రవరిలో పరిహారం అందించారు. టీడీపీ సర్కారు ఎగ్గొట్టిన బకాయిలతో కలిపి ఈ నాలుగేళ్లలో వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న 30.86 లక్షల ఎకరాలకు సంబంధించి 22.22 లక్షల మంది రైతులకు రూ.1,911.81 కోట్లు చెల్లించింది. రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా కింద రూ.6,684.84 కోట్ల పరిహారం అందించిన ఘనత ఈ ప్రభుత్వానిదే. 

‘రైతుల నుంచి అంకూర్‌ సోనం రకం 400 బస్తాల ధాన్యాన్ని రెండు నెలల క్రితం కొన్నా. రైసు మిల్లు ఆవరణలో ఆరబెట్టుకుంటే ఫొటోలు తీసి రైతులవి అంటూ ఈనాడు పత్రికలో వేయటాన్ని చూసి ఆశ్చర్యపోయాం. వర్షాలకు పైపొర మాత్రమే తడిసింది. బస్తాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతాలకు పంపించాం. డ్రయ్యర్‌లో వేస్తాం. మాకు ఇబ్బందేమీ లేదు. ఉందని ఎవరితోనూ చెప్పలేదు కూడా!’  
– బొడ్డు మహేష్‌రెడ్డి, ధాన్యం వ్యాపారి 

‘100 బస్తాలు కొని రైసు మిల్లు ఆవరణలోని డ్రెయింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ వద్ద కూలీల సాయంతో ఆరబెట్టాం. ఆరబెట్టేందుకు బస్తాకు రూ.15 చొప్పున అద్దె చెల్లించాం. 10 శాతమే తడిసింది. డ్రయ్యర్‌లో వేస్తాం. ఇందుకోసం బస్తాకి రూ.100 ఖర్చవుతుంది. మేం నష్టపోయే పరిస్థితులైతే లేవు’  
– మైలవరపు సాంబయ్య, ధాన్యం వ్యాపారి. 

ఇది కూడా చదవండి: సీఎం జగన్‌తో యూఏఈ రాయబారి సమావేశం..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement