గుర్తింపు కార్డుల జారీలో జాప్యం రుణాలు పొందడంలో ఇబ్బందులు పంట నష్టపోతే అంతే.. చొరవ చూపించని అధికారులు
రూపాయి అప్పు ఇవ్వలే...
ఆరేళ్ల సంది కౌలుకు చేత్తన్న. ఆరెకరాల్లో పత్తి, వరి సాగుచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. వానదేవుడు కనికరించక, వడగళ్లతో పంటలు నష్టపోయిన. ప్రతి సీజన్‌కూ అప్పులు చేసి పంటలను సాగుచేత్తున్నం. రైతు రాసిచ్చిన కౌలు కాయితం, పట్టా బుక్కులు చూసి మూడేళ్ల కిందట కౌలుకార్డు ఇచ్చిండ్రు. గిప్పటి వరకు కార్డు ఉందే తప్ప, బ్యాంకోళ్లు రూపాయి అప్పు ఇవ్వలేదు. పోయినేడు పెట్టుబడుల మందం పైసలు వచ్చినయి. గిప్పుడు చేతిలో చిల్లిగవ్వలేదు. ప్రైవేట్‌లో రూ.20వేలు అప్పుతెచ్చి నాలుగున్నరెకరాల్లో వరి, ఎకరంన్నరలో పత్తి పెట్టా. తెలంగాణ ప్రభుత్వమైనా కౌలుకార్డు ఇచ్చి ఆదుకోవాలి.
- పిట్టల నర్సయ్య, కౌలురైతు, గోపాల్‌నగర్, బచ్చన్నపేట
సాక్షి, హన్మకొండ : బ్యాంకు రుణాలు పొందడం, పంట నష్ట పరిహారం అందుకోవడంలో కౌలు రైతుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం 2011 సంవత్సరంలో కౌలు రైతుల అర్హత గుర్తింపు కార్డులు అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్డులు కలిగిన కౌలు రైతు లు భూమి యజమాని అంగీకారం తో నిమిత్తం లేకుండా బ్యాంకు రుణాల మంజూరు, రాయితీపై ఎరువులు, ఠమొదటిపేజీ తరువాయి
విత్తనాలు పొందవచ్చు. అదేవిధంగా ప్రకృతి విపత్తులతో పంట నష్టపోయిన సందర్భాల్లో ప్రభుత్వ సాయం పొందేందుకు ఓ సాధనంగా ఉపయోగపడు తుంది. ఒక ఏడాదిపాటు భూమిని కౌలుకు తీసుకున్న రైతులకు ఈ రుణ అర్హత కార్డులు జారీ చేయాలి. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే మార్చిలో గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియను మొదలుపెట్టి జూన్ 15వ తేదీ వరకు కౌలు రైతులకు ఈ పట్టాలు అందివ్వాలి. ఈ బాధ్యతను క్షేత్రస్థాయిలో వీఆర్‌వో, డిప్యూటీ తహసీల్దార్లు నిర్వహించాల్సి ఉంది.
ప్రభుత్వ నిర్లక్ష్యం
2011 సంవత్సరం తొలినాళ్లలో రుణ అర్హత కార్డులకు అనూహ్య స్పందన లభించింది. జిల్లాలో 1.20 లక్షల మంది కౌలు రైతులు ఉండగా 30 వేల మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు మంజూరయ్యూరుు. ఈ అర్హత కార్డులు పొందిన రైతులు రుణసాయం కోసం బ్యాంకులకు వెళ్తె భూమి యజమాని నుంచి అంగీకార పత్రం తీసుకురావాల్సిందిగా అధికారులు కొర్రీలు వేశారు. దీనితో సమస్య మొదటికి వచ్చింది. బ్యాంకు అధికారులు, కౌలు రైతులకు మధ్య నెలకొన్న సందేహాలను తీర్చేందుకు జిల్లా అధికారులు చొరవ చూపలేదు. తొలి ఏడాది కేవలం నాలుగు శాతం రైతులకే రుణాలు అందాయి.
ఫలితంగా రైతులు ఈ కార్డులను తీసుకోవడంపై అనాసక్తి చూపారు. 2014లో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో రుణ అర్హత కార్డులు జారీ చేయలేదు. ఎన్నికలు ముగియడం, కొత్త రాష్ట్రం, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రుణ అర్హత కార్డుల జారీలో జాప్యం జరిగింది. ఫిబ్రవరిలో మొదలు కావాల్సిన ప్రక్రియ జూన్‌లో ప్రారంభమైంది. దానితో ఈ ఖరీఫ్‌కి కౌలు రైతుల రుణఅర్హత కార్డుల జారీ అందని ద్రాక్షగానే మిగిలింది. ఈ విషయంలో బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నారుు. ఇప్పటికైనా తెలంగాణ సర్కారు రుణ అర్హత కార్డులు మంజూరు చేయూలని రైతులు కోరుతున్నారు.
రాయితీలు అందించాలి..
నేను ఎంకాం వరకు చదువుకున్నా. దుగ్గొండి మండలం రాజుతండాలో నాలుగేళ్లు గా భూమిని కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నా. మూడెకరాల భూమికి రూ.48 వేలు చెల్లించా. ప్రభుత్వం కౌలు రైతులకు రుణాలిస్తామంటూ గతంలో రెండు సార్లు కౌలు గుర్తింపు కార్డులు ఇచ్చింది. నేటికి రూపాయి రుణం అందలేదు. రెండేళ్ల క్రితం అధిక వర్షాలతో పంట నాశనమైంది. పోయినేడాది పంట నష్టం ఇచ్చింది. కానీ.. నష్టపరిహారం అందలేదు. ఆపై ఆ పరిహారాన్ని అసలు రైతులకే ఇచ్చారు. గతేడాది పంటలు గిట్టుబాటు కాక రూ. లక్ష నష్టం వచ్చింది. ప్రభుత్వం సాయం చేసింది శూన్యం. ఇప్పటికైనా ప్రభుత్వం కౌలు రైతులకు రుణాలతోపాటు పంట నష్టపరిహారం, రాయితీలు అందేలా చూడాలి.
- బానోతు శ్రీనివాస్, దుగ్గొండి
కౌలు రైతుకు కష్టం
Published Mon, Jun 29 2015 3:33 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement