జనగామ క్రైం, న్యూస్‌లైన్ : జనగామ డివిజన్ ఏఎస్పీ జోయల్ డేవిస్‌కు అరుదైన అవకాశం లభించింది. ఈ నెల 15వ తేదీన సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించే స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన పరేడ్ కమాండెంట్‌గా జాతీయ పతాకానికి గౌరవ వందనం చేయనున్నారు. 2010 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన జోయల్ డేవిస్ స్వస్థలం తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి ప్రాంతంలోని పుట్టకొడ గ్రామం. ఆయన ప్రసుత్తం జనగామ ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. స్వాంతత్య్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించే పెరేడ్‌కు నేతృత్వం వహించనున్నారు.
ఇందుకు గాను ఆయన పేరేడ్ గ్రౌండ్‌లో ఈ నెల 1 నుంచి జరుగుతున్న రిహార్సల్‌లో పాల్గొంటున్నారు. పెరేడ్‌గ్రౌండ్‌లో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో జనగామ డివిజన్ నుంచి పాల్గొనబోయే రెండవ ఐపీఎస్ అధికారి డేవిస్. గతంలో ఇక్కడ ఏఎస్పీగా పనిచేసిన అంజనీకుమార్ 1992 ఆగస్టు 15న పెరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు.
జనగామ ఏఎస్పీకి అరుదైన అవకాశం
Published Wed, Aug 14 2013 4:51 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM
Advertisement
Advertisement