
కన్యాకుమారి: ‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో రాహుల్ గాంధీ తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారకం వద్ద బుధవారం ఉదయం నివాళులర్పించారు. అనంతరం కన్యాకుమారిలో ర్యాలీని ప్రారంభిస్తారు. కార్యక్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ సీఎంలు అశోక్ గహ్లోత్, భూపేశ్ బఘేల్‌తో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు, పార్టీ శ్రేణులు భారీగా పాల్గొంటారు. ఖాదీ జాతీయ జెండాను చేతబూని రాహుల్ తన యాత్రను ప్రారంభిస్తారు.
కాగా నేటి నుంచి కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ ప్రారంభం కానుంది.కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సుధీర్ఘ యాత్ర సాగనుంది. సుమారు 3,570 కిలోమీటర్ల మేర 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా రాహుల్ యాత్ర సాగనుంది.
చదవండి: కర్ణాటక మంత్రి హఠాన్మరణం
Comments
Please login to add a commentAdd a comment