MK Stalin Congratulates Student Sarvesh - Sakshi
Sakshi News home page

750 కి.మీ. నడిచిన తొమ్మిదేళ్ల సర్వేశ్‌.. అభినందించిన సీఎం స్టాలిన్‌

Published Sun, Oct 17 2021 7:26 AM | Last Updated on Sun, Oct 17 2021 10:26 AM

MK Stalin Congratulates Student Sarvesh - Sakshi

సర్వేశ్‌ను అభినందిస్తున్న సీఎం స్టాలిన్‌  

సాక్షి, చెన్నై: ప్రపంచంలోని పరిస్థితులు, మార్పు, సాధించాల్సిన లక్ష్యాలను వివరిస్తూ తొమ్మిదేళ్ల బాలుడి కన్యాకుమారి నుంచి చెన్నైకు నడక పయనం పూర్తి చేశాడు. ఆ బాలుడ్ని సీఎం ఎంకే స్టాలిన్‌ శనివారం అభినందించారు. చెన్నై తాంబరం సమీపంలోని సాయిరాం పాఠశాలలో  ఐదో తరగతి చదువుకుంటున్న సర్వేశ్‌(9) ప్రపంచంలోని ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ కన్యాకుమారి నుంచి చెన్నైకు అవగాహన యాత్ర చేయాలని నిర్ణయించాడు.

ఆ మేరకు గాంధీ జయంతి రోజు(అక్టోబరు 2)న కన్యాకుమారి లోని గాంధీ మండపం వద్ద తన నడక పయనాన్ని చేపట్టాడు. 750 కి.మీ దూరం 14 రోజుల పాటుగా నడిచాడు. శుక్రవారం సాయంత్రం చెన్నై శివారులోని వండలూరుకు చేరుకున్న ఈ బాలుడ్ని సహచర విద్యార్థులు ఆహ్వానించారు. శనివారం ఉదయం వళ్లువర్‌కోట్టంలో తన పయనాన్ని ఆ బాలుడు ముగించాడు.

చదవండి: (ఆరవ తరగతి విద్యార్థినికి సీఎం స్టాలిన్‌ ఫోన్‌ కాల్‌)

ఈ సందర్భంగా ఆ బాలుడ్ని సీఎం ఎంకే స్టాలిన్, మంత్రి ఎం సుబ్రమణియన్‌తో పాటుగా, తాంబరం ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ రాజా అభినందించారు. పుష్పగుచ్ఛాన్ని అందజేసి సత్కరించారు. అనంతరం సీఎం స్టాలిన్‌ కొళత్తూరు నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ పేదలకు రూ. 2 కోట్ల విలువైన సంక్షేమ పథకాలను అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement