సాక్షి, చెన్నై: ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో కన్యాకుమారి జిల్లాలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నా యి. ఇక రాష్ట్రంలో పలు చోట్ల కెరటాలు వెనక్కి తగ్గడంతో ప్రజల్లో సునామి భ యం బయలు దేరి ఉన్నది. కుమరిలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై అధికారులతో మంత్రి ఆర్‌బీ ఉదయకుమార్ సమాలోచించారు.
ఈశాన్య రుతు పవనాల ప్రభావం అత్యధికంగా కేరళ సరిహద్దుల్లో ఉన్న కన్యాకుమారి జిల్లా మీద ఉన్నది. తదుపరి తిరునల్వేలి మీద ప్రభా వం చూపుతున్నది. అయితే కన్యాకుమారిలో మాత్రం ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. కాసేపు కుండ పోతగా, మరి కాసేపు చిరు జల్లులతో కూడిన వర్షం పడుతుండడంతో అక్కడి జలాశయాలన్నీ నిండే స్థాయి చేరాయి. పెరుంజాని జలాశయం నిండడంతో ఉబరి నీళ్లను విడుదల చేశారు. ఆ తీరం వెంబడి ఉన్న పదిహేడు గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేశారు.
అలాగే ఐదు గ్రామాల తీరవాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షం తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా, జిల్లాల్లోని అన్ని చెరువులు, చిన్న చిన్న జలాశయాలు, చెక్ డ్యాంల నుంచి ఉబరి నీటిని విడుదల చేసే పనిలో పడ్డారు. కుమరిలో వర్షం ప్రభావం అత్యధికంగా ఉండడంతో అక్కడ చేపట్టిన ముందస్తు చర్యలు, బాధితుల్ని ఆదుకునేందుకు తగ్గ కార్యక్రమాలపై రెవెన్యూ శాఖ మంత్రి ఆర్‌బీ ఉదయకుమార్ సోమవారం సచివాలయంలో సమీక్షించారు. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. వెనక్కి సముద్రం: నిన్న మొన్నటి వరకు కడలిలో కెరటాల జడి అంతాఇంతా కాదు.
చెన్నై పట్టినం బాక్కం, శ్రీనివాసపురంలతో పాటుగా నాగపట్నం నుంచి కన్యాకుమారి తీరం వరకు కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడ్డాయి. పట్టినంబాక్కంలో అయితే, యాభై ఇళ్లు ఈ అలల తాకిడికి పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో సోమవారం ఉన్నట్టుండి సముద్రం వెనక్కి తగ్గింది. సాధారణంగా ఒడ్డుకు దూసుకొచ్చే ప్రాంతం నుంచి మరీ వెనక్కి తగ్గడంతో ప్రజల్లో ఆందోళన బయల్దేరింది. ఎక్కడ సునామీ వంటి ప్రళయాలు ఎదురవుతాయో అన్న ఆందోళన నెలకొని ఉన్నది. ఇందుకు కారణం గతంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడడం, తదుపరి వెనక్కు తగ్గడం అనంతరం కొద్ది రోజులకు సునామీ రూపంలో ప్రళయం ముంచుకు రావడం తెలిసిందే.
కుమరిలో హైఅలర్ట్
Published Tue, Jun 14 2016 2:00 AM | Last Updated on Mon, Sep 4 2017 2:23 AM
Advertisement
Advertisement