సాక్షి, చెన్నై: కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్‌లో ధ్యానం చేస్తున్న ప్రధాని మోదీ శుక్రవారం సూర్యోదయ వేళ సూర్యునికి ఆర్ఘ్యం సమరి్పంచారు. కాషాయ వ్రస్తాలను ధరించిన ప్రధాని మోదీ జపమాల చేబూని, కమండలంలోని జలాన్ని సముద్రంలోకి వదులుతూ ప్రార్థన చేశారు. అనంతరం సర్వశక్తిమంతుడైన ఆ సూర్యభగవానునికి ముకుళిత హస్తాలతో నమస్కరించారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను, సంక్షిప్త వీడియోను బీజేపీ ‘ఎక్స్’లో షేర్ చేసింది. ధ్యాన మంటపంలో ప్రధాని ధ్యానంలో ఉన్న ఫొటోలను, జపమాలతో ధ్యాన మంటపం చుట్టూ ఆయన ప్రదక్షిణలు చేస్తున్న ఫొటోలను కూడా బీజేపీ విడుదల చేసింది. మే 30వ తేదీ సాయంత్రం మొదలైన మోదీ ధ్యానం జూన్ ఒకటో తేదీ సాయంత్రంతో ముగియాల్సి ఉంది.
అయితే, ప్రధాని మోదీ పర్యటన కారణంగా వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద పర్యాటకులు ఇబ్బందులు పడ్డారని తమిళనాడు మంత్రి దురైమురుగన్ ఆరోపించారు. ఆ పరిసర ప్రాంతాల్లోకి ప్రజలతోపాటు ఓడలు, విమానాలను కూడా అనుమతించలేదని చెప్పారు. ‘ఎన్ని భంగిమలు! ఎంతమంది ఫొటోగ్రాఫర్లు! స్వామి వివేకానంద మౌనంగా ఉన్నారు’అంటూ తమిళనాడు కాంగ్రెస్ ప్రధాని మోదీ ధ్యానంపై వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment