దసరా సెలవులు సమీపిస్తున్నాయి... ఫ్యామిలీ అంతా కలిసి ఏదైనా టూర్‌కి వెళ్లి ఎంజాయ్ చేయాలనుకోవడం సహజం. కానీ, రైల్వే, విమాన టికెట్ల రిజర్వేషన్, వీసా మొదలు... గైడు, చూడాల్సిన ప్రదేశాల ఎంపిక, భోజనం, వసతి ఏర్పాట్లు కష్టమే. వీటికి భయపడే చాలా మంది తమ టూర్లు రద్దు చేసుకుంటారు. అరుుతే.. ఇప్పుడు అలాంటి సందేహాలు అక్కర్లేదు. ఆ ఏర్పాట్లన్నీ చూసుకునే టూర్ సర్వీసెస్ వరంగల్ నగరంలో విస్తరిస్తున్నాయి. ఒక్కటేమిటి... అన్ని రకాల సేవలను ఆయూ సంస్థలే బాధ్యతగా తీసుకుంటున్నారుు. ఇక మీరు చేయూల్సిందల్లా... ఎమౌంట్ చెల్లించడమే.
సాక్షి, హన్మకొండ :తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలు, వివాహ శుభకార్యాలకు వాహనాలు నడిపించడమే గతంలో టూర్ సర్వీసెస్‌గా ఉండేది. ఇప్పుడు బస్సులో తీసుకెళ్లడమే కాదు.. అక్కడ బ్రేక్ దర్శనాలు కూడా చేరుుస్తున్నారు. హానీమూన్ ప్యాకేజీలు కూడా అందిస్తున్నారు. పెళ్లి, విహారయాత్రలకు వాహనాలు సమకూర్చడం ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న అంశంగా మారింది. యాత్ర ప్రత్యేకతలను తెలిపే గైడ్ల నుంచీ... వసతి, భోజన, దర్శన, వీసా, టికెట్ల వంటి ఏర్పాట్లు చేసే సంస్థలు వెలిశారుు. ఈ సర్వీసెస్ వరంగల్‌లో అందుబాటులోకి రాగా... ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.
టూర్ ఏదైనా సరే..
విద్యార్థులు వెళ్లే ఎడ్యుకేషనల్ టూర్స్, ఫ్యామిలీస్ వెళ్లే పుణ్యక్షేత్రాల దర్శనం, కొన్ని కుటుంబాలు కలిసి చేసే ఆథ్యాత్మిక యాత్రలు, కార్పొరేట్ కంపెనీలు ఏర్పాటు చేసే రిఫ్రెష్‌మెంట్ టూర్స్, సింగిల్‌గా వెళ్లే ఎడ్వెంచర్స్ టూర్, కొత్తగా పెళ్లైన జంటలకు హానీమూన్... ఇలా ఏదైనా సరే అన్నీ ఏర్పాట్లు చకచకా జరిగిపోతుంటాయి. టూర్ బుక్ చేసుకుని ఎమౌంట్ చెల్లిస్తే చాలు. ఆ తర్వాత ఎలాంటి టెన్షన్స్ లేకుండా టూర్‌ని ఎంజాయ్ చేయడమే యాత్రికులకు మిగిలిన పని. సింపుల్‌గా చెప్పాలంటే రైల్వే రిజర్వేషన్ నుంచి మొదలు పెడితే విదేశాల్లో వీసా ఇప్పించడం వరకు అన్ని బాధ్యతలను ఈ సంస్థలే తీసుకుంటున్నారుు.
సేవలు ఎలా అంటే..
ముందుగా సదరు వ్యక్తులు ఎక్కడికి వెళతారో... సంస్థలో బుక్ చేసుకోవాలి. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు రైలు, బస్సు, విమానం టికెట్లు బుక్ చేసి ఇస్తారు. ఆ తర్వాత వరంగల్ నుంచి బయల్దేరి గమ్యస్థానం చేరిన వెంటనే అక్కడ ఈవెంట్ మేనెజ్‌మెంట్ సంస్థకు సంబంధించిన బాధ్యులు యాత్రికులను పికప్ చేసుకుంటారు. ఒప్పందం ప్రకారం 3 స్టార్, 4 స్టార్ హోటళ్లలో వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారు. అనంతరం దర్శనీయ స్థలాలు చూసేందుకు వాహనం, గైడ్, అనుమతి తదితర పనులన్నీ వీరే చక్కబెడతారు. తిరుపతి వంటి పుణ్యక్షేత్రాల్లో అయితే బ్రేక్ దర్శనం ఏర్పాట్లు కూడా ఈ సర్వీస్ సంస్థకు చెందిన బాధ్యులే తీసుకుంటారు. యాత్ర మొత్తం పూర్తయిన తర్వాత తిరిగి వరంగల్ చేరే వరకు ఏ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తారు.
అందుబాటులో ఉన్న ప్యాకేజీలు
ఎడ్యుకేషన్ టూర్‌లో భాగంగా విద్యార్థులకు జిల్లాలో హన్మకొండలోని వేయిస్తంబాలగుడి, భద్రకాళి టెంపుల్, ఖిలావరంగల్, లక్నవరం, రామప్ప ప్యాకేజ్ టూర్ అందుబాటులో ఉంది. ఈ ప్రదేశాల దర్శనంతో పాటు లంచ్, స్నాక్స్ కూడా అందిస్తారు. ఇవి కాకుండా ఎడ్యుకేషన్ టూర్‌లో మైసూర్, బెంగళూరు, కన్యాకుమారి ప్యాకేజీలూ ఉన్నాయి. ఈ ప్యాకేజీకి కనీసం 50 మంది విద్యార్థులు ఉండాలి. ప్రకృతి, పుణ్యక్షేత్రం ప్యాకేజీలో భద్రాచలం అందుబాటులో ఉంది. ఇక షిర్డీ, వైజాగ్, తిరుపతి వంటి ప్రాంతాలకు సంబంధించి మూడు పగళ్లు, నాలుగు రాత్రుల ప్యాకేజీకి అన్ని ఖర్చులు కలిపి ఒక్కరికి రూ. 6000 వరకు చార్జ్ వేస్తున్నారు.
కొత్తగా పెళ్లైన జంటలకు సంబంధించి కేరళకు హనీ మూన్ ప్యాకేజీ ఉంది. ఇందులో ఐదు రాత్రులు, నాలుగు పగళ్లు కలిపి జంటకు రూ. 44,000 చార్జ్ తీసుకుంటున్నారు.
బ్యాంకాక్ టూర్‌లో భాగంగా ఐదు పగల్లు, నాలుగు రాత్రులకు సంబంధించి ఒక్కరికి రూ. 44,000... ఖాట్మాం డు టూర్‌లో మూడు పగల్లు, నాలుగు రాత్రుళ్లకు సంబంధించి ఒక్కరికి రూ. 25,000 చార్జ్ వేస్తున్నారు. విదేశీ యాత్రల్లో తెలుగు భాష తెలిసిన గైడ్, ఇంగ్లిష్ భాష వచ్చిన క్యాబ్ డ్రైవర్లను సంస్థలే సమకూర్చుతారుు.
ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ అందిస్తున్న ప్యాకేజీలు (హైదరాబాద్ నుంచి)
కాకతీయ హెరిటేజ్ ప్యాకేజ్ ( 2 డేస్, 2 నైట్స్)
యాదగిరిగుట్ట, పెంబర్తి, జైన దేవాలయం, చేర్యాల పెయింటింగ్స్, ఖిలా వరంగల్, భద్రకాళి టెంపుల్, వేయిస్తంభాలగుడి, గణపురం కోటగుళ్లు, రామప్పదేవాలయం, ఏటూరునాగరాం అభయారణ్యం, లక్నవరం సరస్సులున్నాయి. ఒక్క యాత్రికుడికి టికెట్ ధర ఏసీ కోచ్ అయితే రూ. 3,000, నాన్ ఏసీ కోచ్‌కు రూ. 2,500.
హిల్‌స్టేషన్ ప్యాకేజ్ (3 డేస్, 2 నైట్స్)
అన్నవరం,బొర్రగుహాలు, అరకు, విశాఖపట్నం, భీమవరం, పాలకొల్లు, విజ యవాడ, ద్వారాకా తిరుమల ఉన్నా రుు. ఏసీ కోచ్ టికెట్ ధర ఒక్కరికి రూ.4,000, నాన్‌ఏసీ కోచ్‌కు రూ. 3,500.
టెంపుల్ ప్యాకేజీ (2 డేస్, 1 నైట్)
వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం, బాసర ప్యాకేజీకి ఏసీ కోచ్ టికెట్ ధర ఒక్కరికి రూ. 2,600, నాన్ ఏసీకి రూ.2,100.
విహారయాత్ర (2 డేస్, 1 నోట్)
భద్రాచలం, పాపికొండలు (బోటు జర్నీ). ఏసీ కోచ్ టికెట్ ధర ఒక్కరికి రూ.2,600, నాన్ ఏసీకి రూ. 2,100.
ఆదరణ బాగుంది
కొంత కాలం క్రితం వరకు ప్రైవేట్ బస్ సర్వీసెస్ ఉండే ఏనుగుల గడ్డ ప్రాంతమే నగరంలో టూరిస్ట్ సర్వీసెస్‌కి అడ్డా. కానీ, పోటీ ప్రపంచంలో అందరూ వివిధ వృత్తుల్లో బిజీ అవడంతో తీరిక లేకుండా ఉంటున్నారు. అందువల్లే పని ఒత్తిడి నుంచి బయట పడేందుకు టూర్స్‌కి ఎక్కువగా వెళ్తున్నారు. అయితే అక్కడ కూడా బస, వసతి ఇబ్బందులు ఉండొద్దని కోరుకుంటున్నారు. అందువల్లే టూరిస్ట్ సర్వీసెస్‌కి నగరంలో ఆదరణ పెరుగుతోంది. మేం సర్వీస్ ప్రారంభించిన వారం రోజుల వ్యవధిలోనే బ్యాంకాక్, ఖాట్మాండుల ప్యాకేజీలను ఇద్దరు టూరిస్టులు బుక్ చేసుకోవడం ఇక్కడున్న డిమాండ్‌ని తెలియజేస్తుంది. మా సర్వీసెస్ కావాలనుకునే వారు 97009 99786 ఫోన్ నంబర్‌లో సంప్రదించవచ్చు.
- ప్రదీప్, హ్యాపీడేస్-హాలీడేస్ మేనేజర్
విదేశాలకు వెళ్లేవారు పెరిగారు
గతంలో యాత్రలు అంటే తిరుపతి, వేములవాడ, కాళేశ్వరం.. లేదంటే చార్‌ధామ్ యాత్ర అన్నట్లుగానే ఉండేది. కానీ గడిచిన ఐదేళ్లలో నగరంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. సమ్మర్ వెకేషన్స్‌కి ఎక్కువ మంది కులూమనాలి, సిమ్లా, గోవా, ఊటీలకు వెళ్తున్నారు. ప్రకృతి ప్రేమికులు ఎక్కువగా కేరళ... లేదంటే బ్యాంకాక్, పుకెట్ ఐలాండ్ వంటి దీవులకు వెళ్తున్నారు. గతంలో ఈ సర్వీస్‌ల కోసం హైదరాబాద్ వరకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు నగరంలో అందిస్తుండటంతో వెకేషన్స్‌కి విదే శాలకు వెళ్లేవారి సంఖ్య పెరిగింది.
- నవీన్, శ్రీజా ట్రావెల్స్ మేనేజింగ్ డెరైక్టర్
టెన్షన్ లేనిటూర్
Published Sun, Sep 22 2013 2:41 AM | Last Updated on Fri, Sep 1 2017 10:55 PM
Advertisement
Advertisement