Education Tour
-
పాఠం కోసం ఫారిన్ వెళదాం చలోచలో!
ఇంగ్లాండ్‌లో అడుగు పెడుతూనే ‘ఎలాగో జ్ఞాపకం పెట్టుకొని కుడికాలే పెట్టాను. నిజానికి అదృష్టం బాగుంటే ఏ కాలు పెట్టినా ఇబ్బంది లేదు. బాగుండకపోతే ఏ కాలు పెట్టినా ఒక్కటే’ అనుకుంటాడు పార్వతీశం. బారిష్టరు చదువు కోసం ఉన్న పల్లెటూరు నుంచి ఇంగ్లాండ్‌కు వెళ్లిన పార్వతీశం తెలియని భాష, మనుషులు, సంస్కృతుల వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతూ మనల్ని తెగ నవ్విస్తాడు. కాలం మారినంత మాత్రాన, చదువు కోసం వెళ్లినవారికి దేశం కాని దేశంలో సమస్యలు ఉండవని కాదు. అవి వేరే రకంగా ఉండవచ్చు. అవి ఏ రకంగా ఉన్నా సరే... యూత్ వాటిని లైట్‌గా తీసుకుంటుంది. విదేశీ యూనివర్శిటీలలో చదువుపై బోలెడు లవ్వు చూపుతోంది... విదేశీ చదువు అనేది ఒకప్పుడు సంపన్న వర్గాల వారికి మాత్రమే పరిమితమైన విషయం. అయితే ఇప్పుడు దృశ్యం మారింది. ఆర్థికస్థాయి, చిన్నా, పెద్దా పట్టణాలు అనే తేడా లేకుండా ఎంతోమంది విద్యార్థులు విదేశాలకు వెళుతున్నారు. ఎనభైలలో ఫారిన్ యూనివర్శిటీ అంటే ఎక్కుమందికి అమెరికాలోని యూనివర్శిటీలు మాత్రమే. ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాలతో పాటు రిమోట్ ఈస్ట్ యూరోపియన్ దేశాలపై కూడా యువత ఆసక్తి ప్రదర్శిస్తోంది. ‘ఎందుకు ఇలా?’ అనే ప్రశ్నకు రకరకాల సమాధానాలు వినిపిస్తాయి. అందులో ఒకటి... ‘పాఠ్యపుస్తకాలను, తరగతి గదినీ దాటి మన విద్యావ్యవస్థ బయటికి రాలేకపోతోంది. పాఠ్యాంశం యూత్‌కు దగ్గర కాలేపోతోంది’ దిల్లీకి చెందిన పద్దెనిమిది సంవత్సరాల శ్రేయకు ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీ అంటే ఆసక్తి. ఆ ఆసక్తి ఆమెను అమెరికాలోని ‘జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ వరకు తీసుకువ్చంది. ‘ఈ యూనివర్శిటీ డిగ్రీ మాత్రమే ఇవ్వదు. ఎంతో అనుభవ జ్ఞానాన్ని ఇస్తుంది’ అంటుంది శ్రేయ. ఫ్లెక్సిబుల్ కరికులమ్ నుంచి ప్రపంచంలోనే అత్యున్నతమైన బోధన సిబ్బంది వరకు ఆ యూనివర్శిటీ గురించి చెప్పుకోదగిన అంశాలను ప్రస్తావిస్తుంది శ్రేయ. ‘విద్యార్థులు తమను తాము వ్యక్తీకరించుకునే అనుభవ జ్ఞానాన్ని విదేశీ విశ్వవిద్యాలయాలు ఇస్తాయి’ అంటున్నారు దిల్లీ యూనివర్శిటీ మాజీ వైస్–ఛాన్సలర్ దినేష్ సింగ్. అయితే ‘అత్యున్నత ప్రవణాలతో కూడిన చదువు’ మాత్రమే మన విద్యార్థులు దేశం దాటడానికి కారణం కావడం లేదు. ‘భిన్నమైన సాంస్కృతిక వాతావరణంలో గడపడం, ఇతర దేశాల విద్యార్థులతో కలిసి చదువుకొనే అవకాశం దానికదే ఒక ఎడ్యుకేషన్’ అనే అభిప్రాయం కూడా విదేశీ విశ్వవిద్యాలయాలపై ఆసక్తికి కారణం అవుతుంది. ‘విదేశీ యూనివర్శిటీలలో చదువుకోవడం అనేది మన విద్యావ్యవస్థను తక్కువ చేయడం కాదు. మన పరిధిని విస్తృతం చేసుకోవడం మాత్రమే’ అంటుంది పుణెకు చెందిన సుమన. దిల్లీకి చెందిన 19 సంవత్సరాల సైబా బజాజ్ కెనడాలోని ‘యూనివర్శిటీ ఆఫ్ మనిటోబ’లో కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. ‘విదేశాలలో చదువు అనేది డిగ్రీలను మించినది. ఇది ఒక రకంగా సెల్ఫ్–జర్నీ’ అంటుంది సైబా. బెంగళరుకు చెందిన ప్రతిభా జైన్ గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సు చేయడానికి యూకేకు వెళ్లాలనుకుంటోంది. ఈ మావ\త్రం దానికి అక్కడిదాకా వెళ్లాలా! అనిపిస్తుందిగానీ ప్రతిభ వెర్షన్ వేరు. ‘యూకేకు వెళ్లాలనుకోవడానికి కారణం... అక్కడి యూనివర్శిటీ ఫర్ ది క్రియేటివ్ ఆర్ట్స్‌కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో ప్రపంచంలో పెద్ద పేరు ఉండడం ఒక కారణం అయితే, సాంస్కృతిక వైవిధ్యం, గ్లోబల్ ఎక్స్పోజర్ అనేది రెండో కారణం. మూడోకారణం ఒకేరకమైన అభిరుచులు ఉన్న వారితో, సబ్జెక్ట్‌కు సంబంధించిన నిపుణులతో కలిసి నెట్‌వర్క్‌గా ఏర్పడే అవకాశం ఉండడం’ అంటుంది ప్రతిభ. జాబ్ మార్కెట్లో సులువుగా విజయం సాధిస్తారు అనే ధీమా వల్ల, మల్టీ కల్చరల్ యూనివర్శిటీలలో తమ పిల్లలను చదివించడానికి పేరెంట్స్ ఆసక్తి చూపుతున్నారు. పక్కా ఫైనాన్స్ ప్లానింగ్, ఎడ్యుకేషన్ లోన్ల వల్ల పిల్లలను విదేశీ యూనివర్శిటీలలో చదివించడం చాలామంది పేరెంట్స్‌కు పెద్ద సమస్య కావడం లేదు. తల్లిదండ్రుల ఆసక్తిని గమనించి నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)లు ఎడ్యుకేషన్ లోన్స్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. మరోవైపు ‘అబ్రాడ్ ఎడ్యుకేషన్ లోన్స్’కు బెస్ట్ ఎన్బీఎఫ్సీలు ఏమిటి? అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పేరెంట్స్. టెస్ట్–ప్రిపేరేషన్, కంట్రీ, కోర్సు, యూనివర్శిటీ ఎంపిక, డాక్యుమెంటేషన్ ప్లానింగ్... మొదలైన వాటిలో స్టడీ అబ్రాడ్ కన్సల్టెన్సీలపై ఆధారపడుతోంది యూత్. జపాన్ అయినా ఓకే అబ్రాడ్ ఎడ్యుషన్ అనగానే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ... మొదలైన దేశాలు గుర్తుకు వస్తాయి తప్ప జపాన్ గుర్తుకు రావడం జరగదు. అయితే గణాంకాల ప్రకారం జపాన్ యూనివర్శిటీలలో చదివే మన విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం జపాన్‌లోని 20 యూనివర్శిటీల ప్రతినిధులు దిల్లీ, పుణె, చెన్నైలలో హైస్కూల్, కాలేజీలలో నిర్వహింన ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు మం స్పందన లభించింది. (చదవండి: ఇంట్లోనే బీర్ తయారీ..జస్ట్ క్షణాల్లో రెడీ చేసుకోవచ్చు ఎలాగంటే) -
చలో ఆస్ట్రేలియా..
సాక్షి,సిటీబ్యూరో: ఉన్నత విద్యకోసం గ్రేటర్ విద్యార్థులు ఆస్ట్రేలియా దేశానికి పోటెత్తుతున్నారు. ఏటా వీరి సంఖ్య పెరుగుతూనే ఉంది. మహానగరం పరిధిలోని డీమ్డ్ వర్సిటీలు, వృత్తి విద్యాకళాశాలల్లో ఫీజులతో పోలిస్తే ఆ దేశంలో ట్యూషన్ ఫీజులు తక్కువగా ఉండడం, సులభతరమైన వీసా నిబంధనలు, చదువుకుంటూనే పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసుకుని జీవనవ్యయానికి అవసరమైన డబ్బులను సొంతంగా సంపాదించుకునే అవకాశం ఉండడంతో మెజార్టీ సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు ఆ దేశం బాట పడుతున్నారు. గత మూడేళ్లుగా వీరి సంఖ్య క్రమంగా పెరుగుతోందని విద్యా సంబంధిత కన్సల్టెన్సీల ప్రతినిధులు పేర్కొన్నారు. ట్రెండ్ మారింది.. గ్రేటర్ విద్యార్థులు ఇప్పుడు ట్రెండ్ మార్చారు. అమెరికాకు బదులుగా ఆస్ట్రేలియా, కెనడా, యుకే దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత మూడేళ్లుగా వీరి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నగరం నుంచి 2017 లో సుమారు 13 వేల మంది, 2018లో 15 వేలు, 2019లో 20 వేల మంది వివిధ రకాల కోర్సులు అభ్యసించేందుకు ఆస్ట్రేలియా వెళ్లినట్లు కన్సల్టెన్సీల ప్రతినిధులు చెబుతున్నారు. అత్యధికులు ఇంజినీరింగ్, మెడిసిన్, బయోటెక్నాలజీ కోర్సుల పట్ల ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో ఆస్ట్రేలియా చెందిన పలు వర్సిటీలు, విద్యాసంస్థల ప్రతినిధులు నగరంలో ప్రత్యేకంగా అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నాయి. ఆయా సదస్సుల్లో ప్రధానంగా విద్యార్థులు లేవనెత్తే సందేహాలను అక్కడి విద్యాసంస్థల ప్రతినిధులు నివృత్తి చేస్తుండటం విశేషం. ఉన్నత విద్యావకాశాలు, అక్కడి ప్రత్యేకతలు, కోర్సులో అంతర్భాగంగా ఉండే సబ్జెక్టులు, వాటితో వారికి భవిష్యత్‌లో లభించే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, వీసా నిబంధనలు, అక్కడి భౌగోళిక పరిస్థితులు, జీవనవ్యయం, చదువుకుంటూనే పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇంటర్మీడియట్ అనంతరం పలు డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు మరికొందరు పీహెచ్డీ కోసం సైతం ఆస్ట్రేలియా బాటపడుతున్నట్లు కన్సల్టెన్సీల ప్రతినిధులు చెబుతున్నారు. ఫీజులు తక్కువే.. నగరంలోని పలు ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సులతోపాటు డీమ్డ్ వర్సిటీల్లో ఉన్న ఫీజుల కంటే ఆస్ట్రేలియాలో ట్యూషన్ ఫీజులు అందుబాటులో ఉండడంతో పలువురు విద్యార్థులు ఆస్ట్రేలియా బాట పడుతుండడం విశేషం. జీవనవ్యయాన్ని సొంతంగా సంపాదించుకునేందుకు ఏటా 100 రోజల పాటు పార్ట్‌టైమ్ ఉద్యోగాలకు చట్టాలు అనుమతిస్తున్నాయన్నారు. దీంతో విద్యార్థినీ విద్యార్థులు తమకు నెలవారీగా అయ్యే ఖర్చులను పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తూ సంపాదించుకునే అవకాశం ఉందంటున్నారు. ప్రధాన కారణాలివీ.. ♦ విద్యా సంబంధిత వీసా పొందేందుకు తక్కువ సమయం పట్టడం. ♦ వివిధ వృత్తి విద్య కోర్సులకు ట్యూషన్ ఫీజులు అందుబాటులో ఉండడం. ♦ ఏడాదికి 100 రోజులపాటు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తూ సొంతంగా సంపాదించుకునే అవకాశం ఉండడం. -
టెన్షన్ లేని టూర్
దసరా సెలవులు సమీపిస్తున్నాయి... ఫ్యామిలీ అంతా కలిసి ఏదైనా టూర్‌కి వెళ్లి ఎంజాయ్ చేయాలనుకోవడం సహజం. కానీ, రైల్వే, విమాన టికెట్ల రిజర్వేషన్, వీసా మొదలు... గైడు, చూడాల్సిన ప్రదేశాల ఎంపిక, భోజనం, వసతి ఏర్పాట్లు కష్టమే. వీటికి భయపడే చాలా మంది తమ టూర్లు రద్దు చేసుకుంటారు. అరుుతే.. ఇప్పుడు అలాంటి సందేహాలు అక్కర్లేదు. ఆ ఏర్పాట్లన్నీ చూసుకునే టూర్ సర్వీసెస్ వరంగల్ నగరంలో విస్తరిస్తున్నాయి. ఒక్కటేమిటి... అన్ని రకాల సేవలను ఆయూ సంస్థలే బాధ్యతగా తీసుకుంటున్నారుు. ఇక మీరు చేయూల్సిందల్లా... ఎమౌంట్ చెల్లించడమే. సాక్షి, హన్మకొండ :తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలు, వివాహ శుభకార్యాలకు వాహనాలు నడిపించడమే గతంలో టూర్ సర్వీసెస్‌గా ఉండేది. ఇప్పుడు బస్సులో తీసుకెళ్లడమే కాదు.. అక్కడ బ్రేక్ దర్శనాలు కూడా చేరుుస్తున్నారు. హానీమూన్ ప్యాకేజీలు కూడా అందిస్తున్నారు. పెళ్లి, విహారయాత్రలకు వాహనాలు సమకూర్చడం ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న అంశంగా మారింది. యాత్ర ప్రత్యేకతలను తెలిపే గైడ్ల నుంచీ... వసతి, భోజన, దర్శన, వీసా, టికెట్ల వంటి ఏర్పాట్లు చేసే సంస్థలు వెలిశారుు. ఈ సర్వీసెస్ వరంగల్‌లో అందుబాటులోకి రాగా... ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. టూర్ ఏదైనా సరే.. విద్యార్థులు వెళ్లే ఎడ్యుకేషనల్ టూర్స్, ఫ్యామిలీస్ వెళ్లే పుణ్యక్షేత్రాల దర్శనం, కొన్ని కుటుంబాలు కలిసి చేసే ఆథ్యాత్మిక యాత్రలు, కార్పొరేట్ కంపెనీలు ఏర్పాటు చేసే రిఫ్రెష్మెంట్ టూర్స్, సింగిల్‌గా వెళ్లే ఎడ్వెంచర్స్ టూర్, కొత్తగా పెళ్లైన జంటలకు హానీమూన్... ఇలా ఏదైనా సరే అన్నీ ఏర్పాట్లు చకచకా జరిగిపోతుంటాయి. టూర్ బుక్ చేసుకుని ఎమౌంట్ చెల్లిస్తే చాలు. ఆ తర్వాత ఎలాంటి టెన్షన్స్ లేకుండా టూర్‌ని ఎంజాయ్ చేయడమే యాత్రికులకు మిగిలిన పని. సింపుల్‌గా చెప్పాలంటే రైల్వే రిజర్వేషన్ నుంచి మొదలు పెడితే విదేశాల్లో వీసా ఇప్పించడం వరకు అన్ని బాధ్యతలను ఈ సంస్థలే తీసుకుంటున్నారుు. సేవలు ఎలా అంటే.. ముందుగా సదరు వ్యక్తులు ఎక్కడికి వెళతారో... సంస్థలో బుక్ చేసుకోవాలి. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు రైలు, బస్సు, విమానం టికెట్లు బుక్ చేసి ఇస్తారు. ఆ తర్వాత వరంగల్ నుంచి బయల్దేరి గమ్యస్థానం చేరిన వెంటనే అక్కడ ఈవెంట్ మేనెజ్మెంట్ సంస్థకు సంబంధించిన బాధ్యులు యాత్రికులను పికప్ చేసుకుంటారు. ఒప్పందం ప్రకారం 3 స్టార్, 4 స్టార్ హోటళ్లలో వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారు. అనంతరం దర్శనీయ స్థలాలు చూసేందుకు వాహనం, గైడ్, అనుమతి తదితర పనులన్నీ వీరే చక్కబెడతారు. తిరుపతి వంటి పుణ్యక్షేత్రాల్లో అయితే బ్రేక్ దర్శనం ఏర్పాట్లు కూడా ఈ సర్వీస్ సంస్థకు చెందిన బాధ్యులే తీసుకుంటారు. యాత్ర మొత్తం పూర్తయిన తర్వాత తిరిగి వరంగల్ చేరే వరకు ఏ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తారు. అందుబాటులో ఉన్న ప్యాకేజీలు ఎడ్యుకేషన్ టూర్లో భాగంగా విద్యార్థులకు జిల్లాలో హన్మకొండలోని వేయిస్తంబాలగుడి, భద్రకాళి టెంపుల్, ఖిలావరంగల్, లక్నవరం, రామప్ప ప్యాకేజ్ టూర్ అందుబాటులో ఉంది. ఈ ప్రదేశాల దర్శనంతో పాటు లంచ్, స్నాక్స్ కూడా అందిస్తారు. ఇవి కాకుండా ఎడ్యుకేషన్ టూర్లో మైసూర్, బెంగళూరు, కన్యాకుమారి ప్యాకేజీలూ ఉన్నాయి. ఈ ప్యాకేజీకి కనీసం 50 మంది విద్యార్థులు ఉండాలి. ప్రకృతి, పుణ్యక్షేత్రం ప్యాకేజీలో భద్రాచలం అందుబాటులో ఉంది. ఇక షిర్డీ, వైజాగ్, తిరుపతి వంటి ప్రాంతాలకు సంబంధించి మూడు పగళ్లు, నాలుగు రాత్రుల ప్యాకేజీకి అన్ని ఖర్చులు కలిపి ఒక్కరికి రూ. 6000 వరకు చార్జ్ వేస్తున్నారు. కొత్తగా పెళ్లైన జంటలకు సంబంధించి కేరళకు హనీ మూన్ ప్యాకేజీ ఉంది. ఇందులో ఐదు రాత్రులు, నాలుగు పగళ్లు కలిపి జంటకు రూ. 44,000 చార్జ్ తీసుకుంటున్నారు. బ్యాంకాక్ టూర్లో భాగంగా ఐదు పగల్లు, నాలుగు రాత్రులకు సంబంధించి ఒక్కరికి రూ. 44,000... ఖాట్మాం డు టూర్లో మూడు పగల్లు, నాలుగు రాత్రుళ్లకు సంబంధించి ఒక్కరికి రూ. 25,000 చార్జ్ వేస్తున్నారు. విదేశీ యాత్రల్లో తెలుగు భాష తెలిసిన గైడ్, ఇంగ్లిష్ భాష వచ్చిన క్యాబ్ డ్రైవర్లను సంస్థలే సమకూర్చుతారుు. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ అందిస్తున్న ప్యాకేజీలు (హైదరాబాద్ నుంచి) కాకతీయ హెరిటేజ్ ప్యాకేజ్ ( 2 డేస్, 2 నైట్స్) యాదగిరిగుట్ట, పెంబర్తి, జైన దేవాలయం, చేర్యాల పెయింటింగ్స్, ఖిలా వరంగల్, భద్రకాళి టెంపుల్, వేయిస్తంభాలగుడి, గణపురం కోటగుళ్లు, రామప్పదేవాలయం, ఏటూరునాగరాం అభయారణ్యం, లక్నవరం సరస్సులున్నాయి. ఒక్క యాత్రికుడికి టికెట్ ధర ఏసీ కోచ్ అయితే రూ. 3,000, నాన్ ఏసీ కోచ్‌కు రూ. 2,500. హిల్‌స్టేషన్ ప్యాకేజ్ (3 డేస్, 2 నైట్స్) అన్నవరం,బొర్రగుహాలు, అరకు, విశాఖపట్నం, భీమవరం, పాలకొల్లు, విజ యవాడ, ద్వారాకా తిరుమల ఉన్నా రుు. ఏసీ కోచ్ టికెట్ ధర ఒక్కరికి రూ.4,000, నాన్ఏసీ కోచ్‌కు రూ. 3,500. టెంపుల్ ప్యాకేజీ (2 డేస్, 1 నైట్) వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం, బాసర ప్యాకేజీకి ఏసీ కోచ్ టికెట్ ధర ఒక్కరికి రూ. 2,600, నాన్ ఏసీకి రూ.2,100. విహారయాత్ర (2 డేస్, 1 నోట్) భద్రాచలం, పాపికొండలు (బోటు జర్నీ). ఏసీ కోచ్ టికెట్ ధర ఒక్కరికి రూ.2,600, నాన్ ఏసీకి రూ. 2,100. ఆదరణ బాగుంది కొంత కాలం క్రితం వరకు ప్రైవేట్ బస్ సర్వీసెస్ ఉండే ఏనుగుల గడ్డ ప్రాంతమే నగరంలో టూరిస్ట్ సర్వీసెస్‌కి అడ్డా. కానీ, పోటీ ప్రపంచంలో అందరూ వివిధ వృత్తుల్లో బిజీ అవడంతో తీరిక లేకుండా ఉంటున్నారు. అందువల్లే పని ఒత్తిడి నుంచి బయట పడేందుకు టూర్స్‌కి ఎక్కువగా వెళ్తున్నారు. అయితే అక్కడ కూడా బస, వసతి ఇబ్బందులు ఉండొద్దని కోరుకుంటున్నారు. అందువల్లే టూరిస్ట్ సర్వీసెస్‌కి నగరంలో ఆదరణ పెరుగుతోంది. మేం సర్వీస్ ప్రారంభించిన వారం రోజుల వ్యవధిలోనే బ్యాంకాక్, ఖాట్మాండుల ప్యాకేజీలను ఇద్దరు టూరిస్టులు బుక్ చేసుకోవడం ఇక్కడున్న డిమాండ్‌ని తెలియజేస్తుంది. మా సర్వీసెస్ కావాలనుకునే వారు 97009 99786 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు. - ప్రదీప్, హ్యాపీడేస్-హాలీడేస్ మేనేజర్ విదేశాలకు వెళ్లేవారు పెరిగారు గతంలో యాత్రలు అంటే తిరుపతి, వేములవాడ, కాళేశ్వరం.. లేదంటే చార్ధామ్ యాత్ర అన్నట్లుగానే ఉండేది. కానీ గడిచిన ఐదేళ్లలో నగరంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. సమ్మర్ వెకేషన్స్‌కి ఎక్కువ మంది కులూమనాలి, సిమ్లా, గోవా, ఊటీలకు వెళ్తున్నారు. ప్రకృతి ప్రేమికులు ఎక్కువగా కేరళ... లేదంటే బ్యాంకాక్, పుకెట్ ఐలాండ్ వంటి దీవులకు వెళ్తున్నారు. గతంలో ఈ సర్వీస్‌ల కోసం హైదరాబాద్ వరకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు నగరంలో అందిస్తుండటంతో వెకేషన్స్‌కి విదే శాలకు వెళ్లేవారి సంఖ్య పెరిగింది. - నవీన్, శ్రీజా ట్రావెల్స్ మేనేజింగ్ డెరైక్టర్