కేరళ పోలీసులు గడిచిన ఆరు నెలల్లో 91,495 మంది క్రిమినల్స్ను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర హోం మంత్రి రమేష్ చెన్నితాల చెప్పారు.
కేరళ పోలీసులు గడిచిన ఆరు నెలల్లో 91,495 మంది క్రిమినల్స్ను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర హోం మంత్రి రమేష్ చెన్నితాల చెప్పారు. గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో నేరకార్యకలాపాల్లో 30 శాతం తగ్గుదల ఉందని ఆయన తెలిపారు.
సీనియర్ పోలీసు అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 25న తాము 'ఆపరేషన్ సురక్ష' ప్రారంభించామని, ఆరు నెలల్లో మొత్తం 91,495 మంది క్రిమినల్స్ను అరెస్టు చేశామని, మరో 66,863 మందిపై నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ చేశామని వివరించారు.