ramesh chennitala
-
కేరళ సర్కార్‌పై కాంగ్రెస్ అవిశ్వాసం
కొచ్చి: కేరళలో పినరయి విజయన్ సర్కార్‌పై ఈనెల 24న అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతుందని ఆ పార్టీ నేత, విపక్ష నేత రమేష్ చెన్నితల శుక్రవారం స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన క్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు. కోవిడ్-19 పేరుతో జరిగిన అవినీతికి బాధ్యత వహిస్తూ తాము కేరళ సీఎం రాజీనామాకు డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.కాగా, కేరళలో ఇటీవల వెలుగుచూసిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులోనూ పినరయి విజయన్ సర్కార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక కోవిడ్-19 రోగులు, క్వారంటైన్లో ఉన్న వ్యక్తుల కాల్ వివరాల రికార్డులను సేకరించరాదని పోలీసులను ఆదేశించాలంటూ కేరళ హైకోర్టులో రమేష్ చెన్నితల దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. కాంటాక్ట్ ట్రేసింగ్ కోసమే కోవిడ్-19 రోగుల టవర్ లొకేషన్ వివరాలను తాము వాడుతున్నామని కేరళ ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన హైకోర్టు రమేష్ చెన్నితల పిటిషన్‌ను కొట్టివేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ను వ్యాప్తి చేస్తున్న వారిని అరెస్ట్ చేసేందుకే పోలీసులు కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం కోవిడ్-19 రోగుల కాల్ రికార్డులను సేకరిస్తున్నారని అంతకుముందు కేరళ సీఎం పినరయి విజయన్ వివరణ ఇచ్చారు. చదవండి : ప్రైవేటికరణకు ఒప్పుకోం : కేరళ సీఎం -
90 వేల మంది క్రిమినల్స్ అరెస్టు
కేరళ పోలీసులు గడిచిన ఆరు నెలల్లో 91,495 మంది క్రిమినల్స్‌ను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర హోం మంత్రి రమేష్ చెన్నితాల చెప్పారు. గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో నేరకార్యకలాపాల్లో 30 శాతం తగ్గుదల ఉందని ఆయన తెలిపారు. సీనియర్ పోలీసు అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 25న తాము 'ఆపరేషన్ సురక్ష' ప్రారంభించామని, ఆరు నెలల్లో మొత్తం 91,495 మంది క్రిమినల్స్‌ను అరెస్టు చేశామని, మరో 66,863 మందిపై నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ చేశామని వివరించారు.