నెయ్యట్టింకర: ‘‘ఒంటిపై నూలుపోగు ఉండదు. ఒళ్లంతా నల్లరంగు పూసుకుంటాడు. అప్పుడప్పుడూ తలపై అండర్‌వేర్ ధరిస్తాడు..’’ ఇంతకుమించి ఆ నగ్నదొంగకు సంబంధించిన ఆధారాలేవీ ఉండేవికావు. రాత్రిపూట ఇళ్లల్లోకి చొరబడి నగలు, నగదు ఎత్తుకెళ్లే చోరుడికోసం ఊళ్లకు ఊళ్లు కాపలా కాసినా ఫలితం లభించలేదు. కొద్ది నెలలపాటు కేరళ-తమిళనాడు సరిహద్దుల్లోని ప్రజలకు కంటిమీద కునుకులేకుండాచేసిన ఆ ‘నగ్నదొంగ’ను పోలీసులు ఎట్టకేలకు దొరకబుచ్చుకున్నారు.
ఓ ఇంటి సీసీటీవీ కెమెరాకు చిక్కిన వాడి ముఖాన్ని క్షుణ్నంగా పరిశీలించి, వలపన్నిమరీ బంధించారు. సదరు దొంగ తమిళనాడుకు చెందిన న్యాయశాస్త్ర విద్యార్థి ఎడ్విన్ జోస్(28) అని పోలీసులు తెలిపారు. బైక్‌లను చోరీచేసి వాటిపై రెక్కీ నిర్వహించి, రాత్రికి దొంగతనాలు చేయడం నగ్నదొంగ స్టైల్. కట్టర్‌తో.. నిద్రించే మహిళల మెడలోని ఆభరణాలను కత్తిరిస్తాడు. ఆసమయంలో వాళ్లుగానీ మేల్కొంటే.. దాడిచేసి చీకట్లో కలిసిపోతాడు. ఇలా కేరళ-తమిళనాడు సరిహద్దు పట్టణాలు, గ్రామాల్లో 30కిపైగా దొంగతనాలు చేశాడు. కేసు నమోదు అనంతరం నిందితుణ్ని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment