భర్తతో ఉత్తర (Soruce:The New Indian Express)
కేరళలో గత ఏడాది నుంచి వరకట్న వేదింపుల సమస్యలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. మే 7, 2020న కొట్టరక్కాకు చెందిన ఉత్తర అనే దివ్యాంగురాలైన వివాహిత పాము కాటుతో మరణించినట్లుగా తొలుత వార్తలు వచ్చిన విషయం విదితమే. అయితే, ఉత్తర తల్లిదండ్రులకు అనుమానం వచ్చి కేసు నమోదు చేయగా ఆస్తి కోసం ఆమెను పెళ్లాడిన భర్త సూరజ్ పకడ్బందీగా ప్లాన్ చేసి చంపినట్లుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఈ క్రమంలో దర్యాప్తు ముమ్మరం చేసిన కేరళ పోలీసు బృందం సజీవ పాము, డమ్మీ చేతిని ఉపయోగించి సీన్ రీకన్‌స్ట్రక్షన్‌కు ప్రయత్నించారు.
కొల్లం జిల్లాలోని అరిప్పలో అటవీ శాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర శిక్షణా కేంద్రంలో ఈ ప్రయత్నం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను గురువారం మీడియాకు విడుదల చేశారు. కోర్టుకు సమర్పించిన ప్రదర్శన వీడియో ప్రాసిక్యూషన్ కేసులో కీలకం అవుతుందని పోలీసులు భావిస్తున్నారు. మంచంపై పడుకున్న డమ్మీ బొమ్మపై నాగుపామును విడిచారు.
If you don't like snakes, don't watch. Kerala police tried to reconstruct Uthra’s murder using a live cobra and a dummy pic.twitter.com/NNwkSicbIi
— Dhanya Rajendran (@dhanyarajendran) August 26, 2021
ఈ విషయం గురించి మహీంద్రా వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ ఛైర్మన్ మనీష్ కుమార్ చెబుతూ.. "మేము చేసిన ప్రయత్నం విఫలం అయ్యింది. పామును డమ్మీ శరీరంపై రెండు, మూడు సార్లు పడేశాను, కానీ అది ఆ బొమ్మను ఏమీ చేయలేదు. ఆ తర్వాత మా బృందం పామును రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. చికెన్ మాంసం ముక్కను డమ్మీ చేతికిచుట్టూ చుట్టి పాము ముందు అనేకసార్లు ఊపారు. అయితే, నాగుపాము ఆ చేతిని కరవలేదు. ఎందుకంటే నాగుపాము జాతులు సాధారణంగా రాత్రి పూట చాలా చురుకుగా ఉండవు. పామును అంతగా రెచ్చగొట్టినప్పటికీ అది దాడి చేయలేదు" అని మనీష్ కుమార్ అన్నారు.(చదవండి: అమ్మా.. నీవు లేని లోకంలో నేనుండలేను..)
If you don't like snakes, don't watch. Kerala police tried to reconstruct Uthra’s murder using a live cobra and a dummy. This is the video pic.twitter.com/C8XPTy1m3y
— Dhanya Rajendran (@dhanyarajendran) August 26, 2021
పామును డమ్మీ చేతి ద్వారా తాకడానికి ప్రయత్నించినప్పుడు అనేక ప్రయత్నాల తర్వాత నాగుపాము కరుస్తుంది. ఈ సహజ కాటును బృందం కొలిచింది. అప్పుడు ఆ కాటు వెడల్పు 1.7 సెం.మీ. దీని తర్వాత బృందం పాము తలను పట్టుకొని దాని కోరలను డమ్మీ చేతికి చుట్టిన చికెన్ మాంసాన్ని కరిపించారు. "కోరల వెడల్పులో మార్పులను మేము గమనించాము. మొదటి కాటు 2 సెం.మీ, రెండవ కాటు 2.4 సెం.మీ" అని మనీష్ కుమార్ చెప్పారు. ఈ బృందం.. పాము కదిలే దవడను ఒక స్కేలును ఉపయోగించి కొలిచింది. దాని దవడ 2 నుంచి 2.5 సెం.మీ వెడల్పు ఉంది. అందువల్ల సహజ కాటు మధ్య మార్పులు ఉన్నాయి అని అన్నారు.
2020 మే 7న కొల్లంలోని అంచల్ లోని తన తల్లిదండ్రుల ఇంట్లో ఇరవై ఆరేళ్ల ఉత్తర శవమై కనిపించింది. ఆమె భర్త సూరజ్ ఒక బ్యాంకు ఉద్యోగి. పాము పట్టే వ్యక్తి నుంచి కొనుగోలు చేసిన విషపూరిత పాము చేత ఆమెను చంపించాడు. ఉత్తర తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసు స్టేషన్ కు వెళ్లి కేసు నమోదు చేశారు. అతను అరెస్టు అయిన తర్వాత సూరజ్ నేరాన్ని అంగీకరించాడని, అతను ఉత్తర నిద్రమాత్రల వల్ల మత్తులో ఉన్నప్పడు నాగుపామును ఆమెపై వేస్తే అది కరవడం వల్ల ఆమె చనిపోయినట్లు పేర్కొన్నాడు.(చదవండి: ఉసురు తీసిన మద్యం మత్తు)
ఉత్తర చంపడానికి సూరజ్ చేసిన రెండవ ప్రయత్నం ఇది అని పోలీసులు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు మార్చి 2020లో ఉత్తర కొరకే ఆ పామును అద్దెకు తీసుకున్నాడు. అయితే, ఆమె తన తల్లిదండ్రుల ఇంటి వద్ద ఉన్నప్పడు ఆమె నాగుపాము కాటుకు గురై చనిపోయింది. అతని తల్లిదండ్రులు, సోదరి ఆమెను చంపడంలో సహాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసు ఇప్పుడు తీర్పు స్థాయికి వచ్చింది. అందుకే కోర్టుకు సమర్పించిన ప్రదర్శన వీడియో(సీన్ రీకన్‌స్ట్రక్షన్) ప్రాసిక్యూషన్ కేసులో కీలకం అవుతుందని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment