‘కన్నింగ్ స్టార్’ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం
గంటల వ్యవధిలో వేలాది పోస్టింగ్స్
సాక్షి, అమరావతి: ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ను కించపరిచేలా గంటల వ్యవధిలో వేలాది పోస్టులు మంగళవారం సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. దీనివెనుక జనసేన, టీడీపీ ఉన్నాయని అల్లు అర్జున్ అభిమానులు పేర్కొంటున్నారు. ఒకే రకమైన కంటెంట్‌తో ‘ఆర్గనైజ్డ్’గా చేస్తేనే తక్కువ వ్యవధిలో భారీ సంఖ్యలో ఇలాంటి పోస్టులు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.
అల్లు అర్జున్‌ను మంగళవారం విచారణకు హాజరు కావాలంటూ హైదరాబాద్ పోలీసులు నోటీసు జారీ చేసిన తర్వాత కొన్ని గంటల్లోనే కర్మ సిద్ధాంతాన్ని గుర్తుచేస్తూ అల్లు అర్జున్‌ను అవమానించేలా ‘కన్నింగ్ స్టార్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో జనసేన, టీడీపీ నేతలు అనుచిత పోస్టులను వేలాదిగా వైరల్ చేశారు. కడుపుమంట చల్లార్చుకోవడానికి ఇలా ఆర్గనైజ్డ్‌గా హీరో అర్జున్ మీద బురదచల్లి జనసేన, టీడీపీ ఆనందిస్తున్నాయని అల్లు అర్జున్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి దుష్ట సంప్రదాయం ‘ఆర్గనైజ్డ్’గా చేసేవారు భద్రంగా ఉంటూ ఎదుటి వారిపై బురద చల్లుతున్నామని అనుకుంటారని, ఆ బురద తమకు అంటుకోదనే భ్రమలో ఉంటారని చెబుతున్నారు. ‘సొంత పవర్‌ని వదిలి అద్దె లెవన్‌కు వెళ్లినప్పటి నుంచే ఈ దరిద్రాలు’ అంటూ పోస్టుల్లో పేర్కొనడం ద్వారా ఎవరు చేస్తున్నారో.. ఎవరు చేయిస్తున్నారో అనే విషయం స్పష్టమవుతోందని అభిమానులు పేర్కొంటున్నారు.
‘కర్మ సిద్ధాంతం.. దరిద్రం’ వంటి పోస్టులు అన్నీ ఒక రకంగా వేర్వేరు పేర్లతో కేవలం గంటల సమయంలో ‘ఫేస్‌బుక్’ తోపాటు ‘ఎక్స్’లోనూ ప్రత్యక్షం కావడంపై ఇదంతా కేవలం ఉద్దే«శపూర్వకంగా రాజకీయ పార్టీలు చేస్తున్న పనేనని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment