పుష్ప సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, నటి రష్మిక ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు. పుష్ప సినిమాలోని పాటలపై వరల్డ్ వైడ్ ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ ఇరగదీశారు. ఈ సినిమాలోని సామీ సామీ పాట ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ పాటకు కొందరు డ్యాన్స్ చేసి ఆ వీడియోలను తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేస్తున్నారు.
తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సామీ సామీ పాటకు ఆక్లాండ్‌కు చెందిన ఓ గర్భిణీ డ్యాన్స్ స్టెప్పులు వేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా గత వారం రోజుల నుంచి ఇదే పాటను పడుతున్నానని తెలుపుతూ.. అందుకే ఈ పాటకు డ్యాన్స్ ట్రై చేశానని చెప్పుకొచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. నెటిజన్లు లైకుల మీద లైకులు కొడుతూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment