
మెగా హీరో సాయిధరమ్ తేజ్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేశారు. అల్లు అర్జున్‌తో పాటు ఆయన భార్య స్నేహను ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో అన్‌ఫాలో చేసినట్ తెలుస్తోంది. అల్లు కుటుంబంలో కేవలం అల్లు శిరీష్‌ను మాత్రమే తేజ్ ఫాలో అవుతున్నారు. అయితే సాయి ధరమ్ తేజ్ తప్ప.. మిగతా మెగా హీరోలందరూ అల్లు అర్జున్‌ను ప్రస్తుతానికి ఫాలో అవుతున్నారు.
కాగా.. బన్నీ గతంలో నంద్యాలకు చెందిన తన స్నేహితుడు శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత తరువాత సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ ఆర్మీ మధ్య పెద్ద ఎత్తున వార్ జరిగింది. అందువల్లే సాయి ధరమ్ తేజ్.. అల్లు అర్జున్‌తో పాటు ఆయన భార్య అల్లు స్నేహారెడ్డిని ఎక్స్, ఇన్‌స్టాలో అన్ ఫాలో చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అప్పట్లోనే నాగబాబు చేసిన ట్వీట్ సైతం వివాదానికి దారితీసింది. ఆ తర్వాత నాగబాబు తన ట్వీట్‌ను తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment