దూసుకుపోతున్న రేసుగుర్రం | Race Gurram is an upcoming Telugu film directed by Surender Reddy | Sakshi
Sakshi News home page

దూసుకుపోతున్న రేసుగుర్రం

Published Thu, Oct 3 2013 1:37 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

దూసుకుపోతున్న రేసుగుర్రం - Sakshi

దూసుకుపోతున్న రేసుగుర్రం

అల్లు అర్జున్ నటిస్తున్న ‘రేసుగుర్రం’ షూటింగ్ రేసుగుర్రంలా దూసుకుపోతోంది. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో బన్నీ నటించడం ఇదే ప్రథమం. యాక్షన్ ఎంటర్‌టైనర్లు తీయడంలో సురేందర్‌రెడ్డికి ఓ ప్రత్యేకమైన శైలి ఉంది. 
 
 బన్నీ ఇమేజ్‌కి తగ్గట్టుగా ‘రేసుగుర్రం’ చిత్రాన్ని ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నారు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్ కథానాయిక. ‘కిక్’ శ్యామ్, సలోని కీలకపాత్రలు పోషిస్తున్నారు. 
 
 ఎస్.ఎస్.థమన్ స్వరాలందిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఈ సినిమాలో వినోదం పాళ్లు అధికంగా ఉంటాయి. బన్నీ కెరీర్‌లోనే ఫుల్‌లెంగ్త్ ఎంటర్‌టైనర్ ఇదే’’ అని చెప్పారు. ఈ నెల 5 నుంచి మరో షెడ్యూలు మొదలు కానుంది. 2014 సంక్రాంతికి ‘రేసుగుర్రం’ను విడుదల చేయాలనేది నిర్మాతల ప్లానింగ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement