పండగచేస్కో..!
బన్నీ, సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు కలిసి నిర్మిస్తున్న ‘రేసుగుర్రం’ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో... ఆ సినిమా తర్వాత బన్నీ నటించే సినిమా విషయంలో అప్పుడే ఫిలింనగర్‌లో చర్చలు మొదలయ్యాయి.
డాన్ శీను, బలుపు చిత్రాలతో దర్శకునిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న మలినేని గోపీచంద్ దర్శకత్వంలో బన్నీ నటిస్తారని సమాచారం. అల్లు అర్జున్‌తో దేశముదురు, జులాయి లాంటి హిట్ చిత్రాలు నిర్మించిన డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తారని వినికిడి. ‘పండగ చేస్కో’ అనే టైటిల్‌ని కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలావుంటే... ఈ సినిమాతో పాటు బన్నీ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘గబ్బర్‌సింగ్’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ని ప్రేక్షకులకు అందించిన హరీష్‌శంకర్ దర్శకత్వంలో ఆయన నటించనున్నారు. ‘దిల్’రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని తెలిసింది.