ఫేస్ బుక్ లో అల్లు అర్జున్ హవా!
అన్ని రంగాలపై సోషల్ మీడియా ప్రభావం చూపుతున్న రోజులివి. టాలీవుడ్ లో కూడా హీరోలందరూ సోషల్ మీడియాతో అనుసంధానమై ప్రేక్షకులను, ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్ లో యువ హీరోలు ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబులను వెనక్కి నెట్టి అల్లు అర్జున్ ఫేస్ బుక్ లో కొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.
తాజాగా అల్లు అర్జున్ ఫేస్ బుక్ లో 40 లక్షల లైక్ లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. మిగితా టాలీవుడ్ హీరోల కంటే అల్లు అర్జున్ కు ఫేస్ బుక్ లైక్స్ రెండింతలు ఎక్కువ. ఇటీవల విడుదలైన 'రేసు గుర్రం' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేస్తోంది. అంతేకాక అల్లు అర్జున్ ఓ బిడ్డకు తండ్రైన సంగతి తెలిసిందే.