సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో 'రేసుగుర్రం' | Allu Arjun Shoots for Race Gurram in Hyderabad. | Sakshi
Sakshi News home page

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో 'రేసుగుర్రం'

Published Mon, Aug 5 2013 1:11 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో 'రేసుగుర్రం'

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో 'రేసుగుర్రం'

అల్లు అర్జున్ రేసుగుర్రంలా సిద్దమవుతున్నారు. మాస్ చిత్రాలను స్టయిలిష్‌గా తీస్తాడని పేరు తెచ్చుకున్న సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఆయన ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘రేసుగుర్రం’ టైటిల్‌ని అధికారికంగా ప్రకటించకపోయినా, అభిమానుల్లో అదే టైటిల్ ప్రచారమవుతోంది. ఇందులో శ్రుతి హాసన్ కథానాయిక. 
 
 లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.కె. వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత నెలలో ఈ సినిమా కోసం రెండు పాటల్ని విదేశాల్లో చిత్రీకరించారు. ఇటలీలో ఒక పాటను, స్విట్జర్లాండ్‌లో మరో పాటను తీశారు. తాజా షెడ్యూల్ ఈ నెల 2 నుంచి హైదరాబాద్‌లో జరుగుతుంది. ప్రధాన తారాగణంపై ఓ భవంతిలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 
 
 ఇప్పటివరకూ బన్నీ చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఇందులో ఆయన పాత్ర చిత్రణ ఉంటుందని యూనిట్ వర్గాల సమాచారం ‘ఏం మాయ చేసావె’ లాంటి చిత్రాలకు పని చేసిన మనోజ్ పరమహంస ఈ సినిమాకు ఛాయాగ్రహణం, తమన్ స్వరాలందిస్తున్నారు. ఈ చిత్రానికి, కథ: వక్కంతం వంశీ, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: నారాయణరెడ్డి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement